Idream media
Idream media
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మంచి ఊపు మీదుంది. ఎన్నికలంటే తెగ ఉత్సాహం చూపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోసం తహతహలాడుతున్న పార్టీకి ఉప ఎన్నికలు జోష్ నింపాయి. ఇప్పటి వరకూ మూడు ఉప ఎన్నికలు జరగ్గా.. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అలాగే తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్ లో కూడా టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. ఈ ఉత్సాహంగా ఎప్పుడు ఏ ఎన్నికలు వస్తాయా అని ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ధోరణి కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో మంచి జోష్ మీద ఉన్న పార్టీ ఏదయ్యా అంటే కచ్చితంగా బీజేపీ అని చెప్పొచ్చు. దుబ్బాక, సాగర్, హుజూరాబాద్ లలో ఉప ఎన్నికలు జరిగితే సాగర్ మినహా.. రెండో చోట్లా కూడా బీజేపీ యే ఎమ్మెల్యే స్థానాలను సాధించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక స్థానం గోషామహల్ లో మాత్రమే విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో గెలుపుతో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు చేరింది. రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ .. ముగ్గురూ ఇప్పుడు బీజేపీలో త్రిబుల్ ఆర్ గా గుర్తింపు పొందుతున్నారు. ఇదిలా ఉండగా, హుజూరాబాద్ విజయంతో ఆ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల మీద ఆశలు పెరిగాయి. అంటే అధికారంలోకి వస్తామనే నమ్మకం పెరిగింది. వచ్చే ఎన్నికల్లోగా తమ బలాన్ని మరింత పెంచుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది.
Also Read : Sajjala, Prasanth Reddy, Harish Rao – మా మీద ఏడుపు ఎందుకు: తెలంగాణకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో ఉప ఎన్నికలు జరగాల్సిన స్థానాలు ఏమున్నాయా అని ఆరా తీసే పనిలో ఉంది. ఉప ఎన్నికలు వస్తే అక్కడ కూడా విజయం సాధించాలని ఆ పార్టీ అనుకుంటోంది. అలా చూస్తున్న కాషాయం పార్టీకి ప్రస్తుతం రెండు అసెంబ్లీ స్థానాలు కనబడుతున్నాయి. ఆ రెండు చోట్ల ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తోంది. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఆ రెండు చోట్లా గెలవడం గ్యారంటీ అనుకుంటోంది. బీజేపీ అనుకుంటున్న రెండు స్థానాల్లో మొదటిది వేములవాడ నియోజకవర్గం. ఇక్కడి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు చెందిన చెన్నమనేని రమేష్. ఈయన పౌరసత్వం కేసు కోర్టులో ఉంది. ఆ కేసులో తీర్పు రమేష్ కు ప్రతికూలంగా వస్తే ఆయన మీద అనర్హత వేటు పడుతుంది. కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. అదే జరిగితే అక్కడ పాగా వేయాలని బీజేపీ ప్లాన్.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ శతవిధాలుగా ప్రయత్నాలు చేసినా గులాబీ పార్టీ ఓడిపోవడంతో తమ పార్టీని ఓడించడం కష్టమనే నమ్మకం బీజేపీ నాయకుల్లో పెరిగిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా ఆ వ్యతిరేకత తగ్గదని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఉప ఎన్నిక జరుగుతుందని బీజేపీ నాయకులు అంచనా వేస్తున్న మరో నియోజకవర్గం మునుగోడు. నల్గొండ జిల్లాలోని ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉంది.
తాను బీజేపీలో చేరతానని ఇదివరకే చెప్పాడు. ఒకవేళ ఆయన బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడు కాబట్టి అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇది కాకుండా నల్గొండ జిల్లాలోనే మరో రెండో మూడో స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నాడు. ఇప్పుడైతే వేములవాడ, మునుగోడు మీద ఆశలు పెట్టుకొని ఉంది కాషాయ పార్టీ. మరి బీజేపీ ప్లాన్ కు టీఆర్ఎస్ ఎటువంటి ప్లాన్ లు వేయనుందో చూడాలి.
Also Read : Huzurabad, Revanth – రేవంత్ కు హుజూరా”బ్యాడ్” కష్టాలు