Swetha
విజయ్ దేవరకొండ నుంచి జూలై 31 న కింగ్డమ్ మూవీ రానుంది. మరో రెండు రోజుల్లో హరి హర వీరమల్లు రానుండడంతో ఈ మూవీ బజ్ కాస్త కనుమరుగవుతుంది. కానీ ఇటు నిర్మాత నాగవంశీ ఇస్తున్న ఇంటర్వూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి
విజయ్ దేవరకొండ నుంచి జూలై 31 న కింగ్డమ్ మూవీ రానుంది. మరో రెండు రోజుల్లో హరి హర వీరమల్లు రానుండడంతో ఈ మూవీ బజ్ కాస్త కనుమరుగవుతుంది. కానీ ఇటు నిర్మాత నాగవంశీ ఇస్తున్న ఇంటర్వూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి
Swetha
విజయ్ దేవరకొండ నుంచి జూలై 31 న కింగ్డమ్ మూవీ రానుంది. మరో రెండు రోజుల్లో హరి హర వీరమల్లు రానుండడంతో ఈ మూవీ బజ్ కాస్త కనుమరుగవుతుంది. కానీ ఇటు నిర్మాత నాగవంశీ ఇస్తున్న ఇంటర్వూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఈ వీకెండ్ నుంచి కింగ్డమ్ టీం రంగంలోకి దిగబోతున్నారు. మరో వైపు సినిమాకు ఫైనల్ టచ్అప్స్ జరుగుతూనే ఉన్నాయి.
అయితే అంతా ఈ సినిమా కేవలం శ్రీలంక శరణార్ధుల బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ అని అనుకుంటున్నారు. కానీ అది మాత్రమే కాదట.. ఈ సినిమాలో అంతకుమించిన స్టోరీ ఇంకోటి ఉందట.సినిమాలో బ్రదర్ సెంటిమెంట్ ను చాలా బలంగా చూపించారని ఇన్సైడ్ టాక్. రీసెంట్ గా సత్యదేవ్ , విజయ్ దేవరకొండల మధ్య బాండింగ్ ను చూపిస్తూ ఓ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ట్రాక్ ను నెక్స్ట్ లెవెల్ లో తీశారట గౌతమ్ తిన్ననూరి. సినిమా హోల్ ప్లాట్ ఏంటంటే.. పోలీస్ గా ఉన్న ఓ యువకుడు తన అన్న మీద జరిగిన అన్యాయాయనికి.. తిరుగుబాటుదారుడిగా మారి.. బలహీన వర్గాలకు నాయకుడిగా ఎలా మారాడు అనేదే పాయింట్ మీద.. సినిమా అంతా కూడా హై వోల్టేజ్ లో నడుస్తుందట.
సో మూవీలో ఎమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుందని ఇన్సైడ్ టాక్. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కు క్యూ కట్టే అవకాశం లేకపోలేదు. వరుస ప్లాపుల తర్వాత విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి. ఒకవేళ హిట్ అందుకుంటే మాత్రం విజయ్ తర్వాత సినిమాలకు మంచి బజ్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇంకొక ఎనిమిది రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.