iDreamPost
android-app
ios-app

జూలై 25న OTT లో ఇన్ని సినిమాలా..

  • Published Jul 24, 2025 | 12:45 PM Updated Updated Jul 24, 2025 | 12:45 PM

ఈ వీకెండ్ థియేటర్స్ ను హరి హర వీరమల్లు ఫిల్ చేసేసింది. తర్వాత తర్వాత టాక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఈ వీకెండ్ మాత్రం థియేటర్స్ దగ్గర జనం క్యూ కడతారు. అయితే థియేటర్ సినిమాల గురించి పక్కన పెడితే ఓటిటి లో మాత్రం ఈ వీకెండ్ అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

ఈ వీకెండ్ థియేటర్స్ ను హరి హర వీరమల్లు ఫిల్ చేసేసింది. తర్వాత తర్వాత టాక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఈ వీకెండ్ మాత్రం థియేటర్స్ దగ్గర జనం క్యూ కడతారు. అయితే థియేటర్ సినిమాల గురించి పక్కన పెడితే ఓటిటి లో మాత్రం ఈ వీకెండ్ అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.

  • Published Jul 24, 2025 | 12:45 PMUpdated Jul 24, 2025 | 12:45 PM
జూలై 25న OTT లో ఇన్ని సినిమాలా..

ఈ వీకెండ్ థియేటర్స్ ను హరి హర వీరమల్లు ఫిల్ చేసేసింది. తర్వాత తర్వాత టాక్ ఎలా ఉంటుందో తెలియదు కానీ.. ప్రస్తుతానికి ఈ వీకెండ్ మాత్రం థియేటర్స్ దగ్గర జనం క్యూ కడతారు. అయితే థియేటర్ సినిమాల గురించి పక్కన పెడితే ఓటిటి లో మాత్రం ఈ వీకెండ్ అదిరిపోయే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. విజయ్ ఆంటోని నటించిన మార్గన్ సినిమాకు మంచి రెస్పాన్స్ ఏ వచ్చినప్పటికీ అనేక కారణాల వలన ఆడియన్స్ కు రీచ్ కాలేకపోయింది. సో ఈ సినిమా జూలై 25 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూడొచ్చు.

ఇక అది కాకుండా నవీన్ చంద్ర నటించిన షో టైం మూవీకి .. విమర్శకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ నవీన్ చంద్ర సినిమాలు ఓటిటి లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటాయో తెలియనిది కాదు. దాదాపు అన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ ఏ ఉంటూ ఉంటాయి. ఈ సినిమా సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇది కాకుండా ఇబ్రహీం అలీఖాన్, సలార్ విలన్ పృథ్విరాజ్ సుకుమారన్, కాజోల్ కాంబినేషన్ లో తెరకెక్కిన.. సర్జమీన్ మూవీ అన్ని భాషల్లో నేరుగా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది . ఇక నెట్ ఫ్లిక్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘మండలా మర్డర్స్’ మీద కూడా అంచనాలు ఊపందుకుంటున్నాయి.

అలాగే భారీ బడ్జెట్ తో రూపొందించిన ‘రంగీన్’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా కథ అంతా కూడా మగ వేశ్య గా మారిన హీరో చుట్టూనే తిరుగుతుంది. సో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులలో కాస్త క్యూరియాసిటీ పెంచింది. ఇవన్నీ కాకుండా ఆల్రెడీ రెండు రోజుల క్రితం మలయాళంలో సూపర్ హిట్ అయినా మూవీ ‘రొంత్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమాకు సోషల్ మీడియా రెస్పాన్స్ బాగానే ఉంది. వీటితో పాటు ఇంకా చాలానే సినిమాలు ఈ వారం ఓటిటి ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉన్నాయి. సో ఈ సినిమాలను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.