iDreamPost
android-app
ios-app

VFX ఛేంజెస్ తో మరోసారి వీరమల్లు.. ?

  • Published Jul 24, 2025 | 3:38 PM Updated Updated Jul 24, 2025 | 3:38 PM

ఐదేళ్ల నుంచి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హరి హర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ప్రీమియర్ , ఫస్ట్ షోస్ నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన నెలకొంది. దానికి కారణాలు లేకపోలేదు

ఐదేళ్ల నుంచి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హరి హర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ప్రీమియర్ , ఫస్ట్ షోస్ నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన నెలకొంది. దానికి కారణాలు లేకపోలేదు

  • Published Jul 24, 2025 | 3:38 PMUpdated Jul 24, 2025 | 3:38 PM
VFX ఛేంజెస్ తో మరోసారి వీరమల్లు.. ?

ఐదేళ్ల నుంచి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. హరి హర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ దక్కాయి. కానీ ప్రీమియర్ , ఫస్ట్ షోస్ నుంచి మాత్రం మిక్స్డ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్ లో కాస్త ఆందోళన నెలకొంది. దానికి కారణాలు లేకపోలేదు. సినిమా చూసిన వారి నుంచి వినిపిస్తున్న మెయిన్ కంప్లైంట్ VFX వర్క్. చాలా చిన్న చిన్న గ్రాఫిక్స్ కూడా సరిగా పట్టించుకోలేదనే టాక్ వచ్చింది. పైగా ఇవన్నీ సెకండ్ ఆఫ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో… టోటల్ గా మూవీ సెకండ్ ఆఫ్ మీద నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.

అయితే ఇలా మొదటి రోజుతో సంబంధం లేకుండా తర్వాత తర్వాత టాక్ ను బట్టి.. హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. సో ఫ్యాన్స్ లో ఇంకా ఎక్కడో ఆ నమ్మకాలు మిగిలే ఉన్నాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న మూవీ VFX విషయానికొస్తే.. ఇప్పుడు రన్ అవుతున్న ప్రింట్స్ లో కీ ఛేంజెస్ చేసి.. VFX వర్క్స్ ను మార్చి.. కొత్త వెర్షన్ ను ఈరోజు సాయంత్రం నుంచి కానీ లేదా రెండు రోజుల తర్వాత కానీ థియేటర్స్ లో స్క్రీనింగ్ అవుతుందట. VFX కంపెనీలలో జరిగిన కొన్ని వ్యవహారాల వలన ఆలస్యం అయిందssని.. అందుకే ఇలాంటి పొరపాట్లు వచ్చాయని.. ఇప్పుడు అవన్నీ సెటిల్ అవ్వడంతో కొత్త వెర్షన్ ను స్క్రీనింగ్ కు తీసుకురానున్నారనే టాక్ వినిపిస్తుంది.

ఇప్పటివరకు దీనికి సంబంధించి అధికార ప్రకటన అయితే లేదులే కానీ.. లోపల మాత్రం దీని గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయట. ఒకవేళ ఇదే కనుక జరిగితే గ్రాఫిక్స్ లో క్వాలిటీ పెరిగి.. మూవీ టాక్ కూడా మారే అవకాశం ఉంది. ఈరోజు ఎలాగూ హరి హర వీరమల్లు సక్సెస్ మీట్ ఉంది. ఇక ఆ మీట్ లో ఏమి చెప్తారో చూడాలి. టాక్ విషయం పక్కన పెడితే.. మొదటి రోజు హరి హర వీరమల్లు ఓపెనింగ్స్ మాత్రం కొత్త రికార్డ్స్ ను సృష్టించేలా ఉన్నాయి. అఫీషియల్ నెంబర్స్ బయటకు వస్తే కానీ అసలు లెక్కలు బయటకు రావు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో టాక్ అటు ఇటుగా కనిపిస్తుంది. కానీ ఓ వారం రోజులు ఆగితే అసలు రేంజ్ ఏంటి అనేది బయటపడుతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.