iDreamPost
android-app
ios-app

ఊహించని ట్విస్ట్ తో ఆగిపోయిన పెళ్లి.. ఇంతకీ ఏంటి ఆ ట్విస్ట్ ?

  • Published May 26, 2022 | 12:38 PM Updated Updated May 26, 2022 | 12:38 PM
ఊహించని ట్విస్ట్ తో ఆగిపోయిన పెళ్లి.. ఇంతకీ ఏంటి ఆ ట్విస్ట్ ?

తెల్లవారితే పెళ్లి.. ఇల్లంతా పెళ్లికొచ్చిన చుట్టాలతో, మామిడి తోరణాలతో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయాన్నే జరిగే పెళ్లిని చూసేందుకు.. అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ.. ఊహించని ట్విస్ట్ తో వైభవంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. భార్యతో కొత్తజీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటున్న వరుడితోసహా.. అందరికీ వధువు షాకిచ్చింది.

నిన్న ఉదయం 9.30 గంటలకు కర్ణాటకలోని విదురాశ్వత్థం చన్నరాయస్వామి కల్యాణమండపంలో వివాహం జరగాల్సి ఉంది. నగర శివారులోని నాగరెడ్డి కాలనీకి చెందిన వెన్నెల(22), కరేకల్లహళ్లివాసి సురేశ్‌కు పెళ్లి నిశ్చయమైంది. మంగళవారం రాత్రి నిబ్బళం జరిపించి అందరూ నిద్రపోయారు. అదే అదనుగా భావించిన పెళ్లికూతురు తన ప్రియుడు, వరుసకు మేనమామ అయిన ప్రవీణ్ (25)తో కలిసి పరారైంది. ఉదయం చూస్తే.. వధువు కనిపించలేదు. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేనమామను ప్రేమించిన విషయం తమకు తెలియదని, చెప్పి ఉంటే అతనికే ఇచ్చి పెళ్లి జరిపించేవారమని వాపోయారు. వధువు చేసిన పనికి ఆమె తల్లిదండ్రులతో పాటు.. కొడుకు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.