iDreamPost
iDreamPost
ఇండియా అంటే ఆయుధాలు దిగుమతి చేసుకొనే దేశం మాత్రమేకాదు, సొంతంగా తయారుచేసిన ఆయుధాలు, మిస్సైల్స్ ను అమ్మే దేశం కూడా. ఇమేజ్ మారుతోంది. గమనించండి.
ఫిలిప్పీన్స్‌తో బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కోసం మొదటిసారిగా ఎగుమతి ఒప్పందాన్ని కుదుర్చుకున్న ఇండియా, ఇండోనేషియాకు ఈ మిస్సైల్స్ ను అమ్మాలనుకొంటోంది. అంతేకాదు, ఇతర ఆగ్నేయాసియా దేశాలకూ బ్రహ్మాస్ గురించి డెమో ఇస్తోంది. ఇండియా దూకుడు ఎలా ఉందంటే, కొన్నేళ్లలోనే కనీసం మూడు-నాలుగు దేశాలకు బ్రహ్మాస్ ను అమ్మనుంది. వియత్నాం, ఇండోనేషియా, మలేషియాలతోపాటు ఎప్పుడూ అమెరికా నుంచి మిస్సైల్స్ కొనే యుఎఇ, సౌదీ అరేబియాలను తనవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నిస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులపై ఒమన్ కూడా ఆసక్తి చూపించింది.
నిజానికి ఇండో-రష్యన్ బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిల కొనుగోలు కోసం ఇండోనేషియా ఇండియాతో చర్చిస్తోంది. ఒప్పందం కుదిరితే, ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి క్షిపణులను దిగుమతి చేసుకునే రెండో దేశం ఇండోనేషియా కానుంది. జనవరి 2022లో, మూడు బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షిపణులను సరఫరా చేయడానికి, ఫిలిప్పీన్స్ నావీ ఇండియాతో $375 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది.
ఇండోనేషియాకు చైనాకు మధ్య గొడవలున్నాయి. తరచు చైనా నావీ ఇండోనేషియా అంతర్జాతీయ జలాల్లోకి వస్తున్నాయి. బ్రహ్మోస్ కనుక ఉంటే చైనాను ఆమడదూరంలో ఉంచొచ్చు.
అందుకే తన యుద్ధనౌకలకు బ్రహ్మోస్ క్షిపణిని సమకూర్చాలని యోచిస్తోంది. ఈ స్వల్ప-శ్రేణి బ్రహ్మోస్ రామ్‌జెట్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విమానం, నౌకలు, నేల మీద నుంచి, అంతేకాదు జలాంతర్గాముల నుండి ప్రయోగించవచ్చు. అంటే చైనాను అడ్డుకోవడానికి ఈ మిస్సైల్స్ బ్రహ్మాస్త్రం కానుంది.
బ్రహ్మాస్ మిస్సైల్స్ తో ఆయుధ మార్కెట్ లోకి ఎంటర్ అయిన ఇండియా, అమెరికానే సవాల్ చేస్తోంది. ఏకంగా అమెరికా హార్పూన్ క్షిపణిలకు ఎసరుపెడుతోంది. ఉక్రెయిన్-రష్యా వార్ లోహార్పూన్ లను వాడుతోంది అమెరికా. రష్యా యుద్ధనౌకలను ముంచేసింది. అలాంటప్పుడు, హార్పూర్ మిస్సైల్ ని కాదని, ఇండో-రష్యా తయారీ బ్రహ్మోస్ మిస్సైల్స్ ను ఎందుకు ఆగ్నేయాసియా దేశాలు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇది పెద్ద ప్రశ్న.
హార్పూన్ (Harpoon ) అనేది ఓవర్-ది-హోరిజోన్, సబ్‌సోనిక్, హై-ఎక్స్‌ప్లోసివ్ యాంటీ షిప్ క్షిపణి. ఇది రాడార్‌తో లక్ష్యాన్ని చేరుకొంటోంది. టార్గెట్ మీద టచ్ అయిన వెంటనే పేలుతుంది. క్షిపణి 224కేజీల పేలోడ్ ను మోసుకెళ్తుంది. ట్రక్కులు, జలాంతర్గాములు, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించొచ్చు
అదే బ్రహ్మోస్ ( BrahMos) సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. మిస్సైల్ వేగం వల్ల దాన్ని మధ్యలో అడ్డగించడం, పేల్చివేయడం చాలా కష్టం. హార్పూన్ ఒక సబ్‌సోనిక్ క్షిపణి. దీన్ని అడ్డుకోవడం సులువు. స్పీడు తక్కువకదా! అదే బ్రహ్మోస్, సూపర్‌సోనిక్ వేగం వల్ల సరాసరి లక్ష్యంమీదకు నిమషాల్లోనే దూసుకెళ్తుంది.
హార్పూన్ క్షిపణి కంటే బ్రహ్మోస్ కలిగి ఉన్న మరొక లాభం, ఇది రాడార్ లకు అంతు సులువుగా చిక్కదు. హార్పూన్ బ్లాక్ II క్షిపణి పరిధి 240 కిలోమీటర్లు. బ్రహ్మోస్ 200-300 కిలోగ్రాముల పేలోడ్ తో 290 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగలదు.
ఇంకో సంగతి బ్రహ్మాస్ ను అవసరాల తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఫిలిప్పీన్స్ నేల మీద నుంచి యుద్ధనౌకల మీదకు ప్రయోగించే క్షిపణులను కొనుగోలు చేస్తే, ఇండోనేషియా యుద్ధనౌక వేరియంట్ కావాలనుకొంటోంది.
అమెరికా హార్పూన్ లతో పోలిస్తే బ్రహ్మాస్ రేటు తక్కువ. ఖర్చు పరంగా చూస్తే ఇండియావి కొనుక్కోవడమే బెటర్. ఇది ఒక రీజన్. ఇక రెండోది, విదేశాంగ విధానపరంగా అమెరికాకన్నా, భారతదేశమే నమ్మదగిన మిత్రుడు. మూడో రీజన్. పొరుగువారికి సహాయం చేయాలన్న యాక్ట్ ఈస్ట్ విధానం. అందుకే భారతదేశం మీద ఆసియాన్ దేశాలకు చాలా నమ్మకం, గౌరవం ఉన్నాయి.
ఇన్ని సుగుణాలు ఉన్నాయికాబట్టే, ఇండోనేషియాతో పాటు, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ , వియత్నాం వంటి దేశాలు, $300 మిలియన్ల చిన్న బడ్జెట్‌తో బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయొచ్చు. ఇంకో సంగతి, ఈ అమ్మకానికి రష్యా వైపు నుండి ఎటువంటి వ్యతిరేకతలేదు. చాలా వరకు ఆసియాన్ దేశాలతో రష్యాకు స్నేహసంబంధాలే ఉన్నాయి.