iDreamPost
android-app
ios-app

సలార్ టికెట్స్ రిలీజ్.. దెబ్బకు సైట్ క్రాష్! ఇది డుంకీ కాదు బాస్!

  • Published Dec 19, 2023 | 8:53 PM Updated Updated Dec 19, 2023 | 8:53 PM

BookmyShow Crashed After Salaar Tickets Release: సరాల్ సినిమా టికెట్స్ కోసం అభిమానులు నెట్టింట కుస్తీలు పడుతున్నారు. టికెట్స్ ఎప్పుడు బుక్ చేద్దామా అంటూ స్మార్ట్ ఫోన్స్ ని పట్టుకుని పడిగాపులు కాస్తున్నారు.

BookmyShow Crashed After Salaar Tickets Release: సరాల్ సినిమా టికెట్స్ కోసం అభిమానులు నెట్టింట కుస్తీలు పడుతున్నారు. టికెట్స్ ఎప్పుడు బుక్ చేద్దామా అంటూ స్మార్ట్ ఫోన్స్ ని పట్టుకుని పడిగాపులు కాస్తున్నారు.

  • Published Dec 19, 2023 | 8:53 PMUpdated Dec 19, 2023 | 8:53 PM
సలార్ టికెట్స్ రిలీజ్.. దెబ్బకు సైట్ క్రాష్! ఇది డుంకీ కాదు బాస్!

సలార్.. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పేరు రీసౌండింగ్ వస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగానే డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటే మూవీ ఫ్యాన్స్ అందరూ అలర్ట్ అయిపోతారు. ఎప్పుడు ట్రైలర్ వస్తుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ ఎదురుచూపులు మొదలు పెట్టేస్తారు. ఇంక మూవీ రిలీజ్ దగ్గర పడిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంటుంది. అందరూ టికెట్స్ కోసం పడిగాపులు మొదలెట్టేస్తారు. ఇప్పుడు కూడా అద సీన్ రిపీట్ అవుతోంది. మిగిలిన స్టేట్స్ లో సలార్ టికెట్స్ రిలీజ్ చేసేశారు. కానీ, తెలుగు స్టేట్స్ లో మాత్రం టికెట్స్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ చిన్న సీన్ ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు.

ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ అనగానే అందరూ బాలీవుడ్ బాద్ షా డంకీ సినిమాతో కంపేర్ చేస్తున్నారు. అసలు బాలీవుడ్ కింగ్ తో పోటీ పడి సలార్ గెలుస్తుందా అంటూ బాలీవుడ్ మీడియా కూడా రాతలు రాసేస్తోంది. అయితే అసలు సలార్ సినిమాకి డంకీ అసలు పోటీనే కాదు అనే విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువు కూడా అయ్యింది. తాజాగా బుక్ మై షో కూడా ఈ రెండు సినిమాల్లో ఏది కింగ్ అనే విషయాన్ని క్లారిఫై చేసినట్లు అయింది. ఇప్పటికే బుక్ మై షోలో డంకీ సినిమా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సోమవారం రాత్రి వరకు సలార్ సినిమా టికెట్స్ ఇంకా బుక్ మై షోలోకి రాలేదు. అసలు అవి రాకముందే బుక్ మై షో సైట్ క్రాష్ అయిపోయింది. డార్లింగ్ ఫ్యాన్స్ టికెట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని సైట్ ని రీఫ్రెష్ చేస్తే సైట్ ఇలా క్రాష్ అయిపోయింది. మరి.. ఇంక ఏ విధంగా సలార్ సినిమాకి డంకీ పోటీ అవుతుందో చెప్పాలంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

Book my show crash by salaar overcrowd booking

మరోవైపు బుక్ మై షోలో రిలీజ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ప్రస్తుతానికి రెండు థియేటర్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అది కూడా డిసెంబర్ 22న రిలీజ్ ఉంటే.. 23వ తేదీకి బుకింగ్ ఓపెన్ చేశారు. అయినా కూడా నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ బుక్ అయిపోతున్నాయి. ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉంటుందటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆహాలో అన్ స్టాపబుల్ షో సమయంలో డార్లింగ్ ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఉన్న రోజు సైట్ క్రాష్ అయిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇంక ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించి ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ ను చూసిన ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తున్నాయి. అందుకే అంతా టికెట్స్ కోసం నెట్టింట కుస్తీలు పడుతున్నారు. మరి.. ప్రభాస్ సినిమా టికెట్స్ రాగానే బుక్ మై షో సైట్ క్రాష్ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet