iDreamPost
android-app
ios-app

నన్ను మోసం చేసింది.. కళ్ళముందే నా భార్య అతనితో నా ఇంట్లో 11 నెలలుగా.. టీవీ నటుడి ఆవేదన..

  • Published May 24, 2022 | 7:01 PM Updated Updated May 24, 2022 | 7:01 PM
నన్ను మోసం చేసింది.. కళ్ళముందే నా భార్య అతనితో నా ఇంట్లో 11 నెలలుగా.. టీవీ నటుడి ఆవేదన..

బాలీవుడ్ టీవీ నటి నిషా రావల్‌, నటుడు కరణ్‌ మెహ్రా గతేడాది విడిపోయారు. కానీ వారి విడాకుల వ్యవహారం ఒక సవంత్సరం నుంచి సాగుతూనే ఉంది. గృహ హింస కేసు కింద నిషా ఫిర్యాదు చేయడంతో కరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే బెయిల్‌పై విడుదలైన కరణ్‌ తన మాజీ భార్య నిషాపై పలు ఆరోపణలు చేశాడు. కరణ్ మీడియా ముందుకొచ్చి నిషా ఏమేమి చేసిందో చెప్పాడు.

కరణ్ మాట్లాడుతూ.. నిషా తనను తానే హింసించుకుని నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది. భారీగా భరణం పొందేందుకే ఇలా చేస్తుంది. నిషా నన్ను మోసం చేసి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇప్పటికీ నా ఇంట్లో ఒక వ్యక్తి నిషాతో కలిసి నివసిస్తున్నాడు. గత 11 నెలలుగా ఆ వ్యక్తి నా ఇంట్లో నిషాతోనే ఉంటున్నాడు. అతనేమో తన భార్యాపిల్లలను విడిచి పెట్టి నా భార్యతో ఉంటున్నాడు, నిషా నన్ను వదిలిపెట్టి అతనితో ఉంటుంది. అంతేకాక వాళ్లిద్దరూ కలిసి నా ఆస్తులు, కార్లు, వ్యాపారాలు కూడా లాక్కున్నారు. నిషాకు సన్నిహితులైన రోహిత్ వర్మ, మునీషా ఖట్వా ఇప్పుడు తనతో ఎందుకు లేరో నిషా చెప్పగలదా? నిషా ఇలాంటి పనులు చేస్తుంది అనే వాళ్ళు తనని వదిలేసి వెళ్లిపోయారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే ఈ ఆరోపణలపై నిషా స్పందిస్తూ.. నాకు ఎలాంటి భరణం అక్కర్లేదు. అయినా నాతో కలిసి సంపాదించింది నాకే ఎలా తిరిగి ఇస్తాడు. మేము సంపాదించినవన్నీ కలిసి సంపాదించుకున్నాం. నా చిన్నవయసు నుంచే నేను సంపాదించడం మొదలుపెట్టాను. యే రిష్తా సీరియల్‌లో భాగం కాకముందు నుంచే నేను కరణ్ కి సపోర్ట్‌గా నిలిచాను అని తెలిపింది. అయితే కరణ్ ఆరోపించిన వివాహేతర సంబంధంపై మాత్రం నిషా స్పందించకపోవడం విశేషం.