iDreamPost
android-app
ios-app

Bollywood: షంషేరా, సామ్రాట్ పృథ్వీరాజ్ .. పెద్ద బ్యానర్, స్టార్ కాస్ట్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఢ‌మాల్!

Bollywood: షంషేరా, సామ్రాట్ పృథ్వీరాజ్ .. పెద్ద బ్యానర్, స్టార్ కాస్ట్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఢ‌మాల్!

బాలీవుడ్ లో వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. స్టార్ హీరోలు, భారీ క్యాస్టింగ్, బడ్జెట్, ఇలా ఎన్ని ఉన్నా.. సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాన్ని దక్కించుకోవడంలో విఫలమవుతూనే ఉన్నాయి.

 

షంషేరా..

ఈ చిత్రం  2022 జూలై 22న విడుదలైంది. రణబీర్ కపూర్, వాణి కపూర్, సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగకపోగా, మొత్తంగా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. రణబిర్, సంజయ్ ల నటన కూడా ఈ సినిమాను గట్టెక్కించలేకపోయింది. మొత్తానికి ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో పెద్ద ఫ్లాప్ గా నిలిస్తుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

 

సమ్రాట్ పృథ్వీరాజ్..

ఈ ఏడాది అక్షయ్ కుమార్ వంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న స్టార్ కు సైతం అచ్చిరాలేదు. ఇటీవల అక్షయ్ నటించిన సమ్రాట్ పృథ్వీరాచ్ చిత్రం భారీ పరాజయాన్నే మూటగట్టుకుంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ వాటిని చేరుకోలేకపోయింది. దీంతో అక్షయ్ అభిమానులు సైతం నిరాశలో ఉన్నారు.

 

రన్ వే 34…

అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు ఉంటే ఆ సినిమాపై కనీస ఆసక్తి కనబరుస్తారు ప్రేక్షకులు. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నా.. సినిమా ఫలితం మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. బాక్సాఫీసు వద్ద రన్ వే34 చిత్రం సైతం ఫ్లాప్ గా నిలిచింది.

 

హీరోపంతీ-2..

టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన ఈ చిత్రానిది కూడా అదే పరిస్థితి. ఏఆర్ రహ్మన్ సంగీతం, సీక్వెల్ గా వచ్చిన కథ.. ఇలా ఈ సినిమాలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే అంశాలు ఉన్నప్పటికీ రోటీన్ గా సాగిన కథాకథనాలతో మరో డిజాస్టర్ గా మారింది.

 

ధాకడ్..

ఈ ఏడాది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాదాపు 85 కోట్లతో నిర్మాణం జరిగితే, కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది ఈ సినిమా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ