iDreamPost
android-app
ios-app

నయనతార మీద కత్రినా ప్రశంసలు

  • Published May 30, 2020 | 4:59 AM Updated Updated May 30, 2020 | 4:59 AM
నయనతార మీద కత్రినా ప్రశంసలు

ఒక హీరోయిన్ కెరీర్ మహా అయితే ఓ పదేళ్లు సాగితే గొప్ప అనుకోవాలి. ఆ తర్వాత ఎంత తోపు తురుము అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే. అలా ఇండస్ట్రీ ఎంతో మందిని చూసింది. కానీ 17 ఏళ్ళ క్రితం వచ్చి ఇప్పటికీ అగ్ర హీరోలు తననే తమ సినిమాల్లో కథానాయికగా కావాలని డిమాండ్ చేస్తున్నారంటే అంతకంటే నయనతార గురించి చెప్పాల్సింది ఏముంటుంది . ఒకపక్క ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ చేస్తూనే మరోవైపు స్టార్ల సరసన జోడిగా నటిస్తూ రెండు రకాలుగా మెప్పిస్తున్న నయన్ మీద తాజాగా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రశంసల జల్లు కురిపించింది.

ఓ మీడియా మ్యాగజైన్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో నయనతార గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు పొగడ్తలతో ముంచెత్తింది. ఈ ఇద్దరూ కలిసి ఎప్పుడు పని చేశారనే డౌట్ రావడం సహజం. సినిమాలో కాదు కాని కేట్ గత ఏడాది కొత్త రకం బ్యూటీ ప్రొడక్ట్స్ లాంచ్ కోసం ఇండియా నుంచి వివిధ రంగాలకు చెందిన అత్యున్నత మహిళలతో ఒక క్యాంపెన్ చేసింది. అందులో నయనతార కూడా పాల్గొంది. ఆ సందర్భంగా ఇద్దరు కలిసి స్మాల్ స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తనతో పని చేయడం గొప్ప అనుభవం చాలా చిన్న వయసులోనే కెరీర్ ప్రారంబించిన నయన్ చేసిన ప్రయాణం సామాన్యమైనది కాదని ఇప్పటికీ సెట్ లో ఆమె తీరు చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుందని కత్రినా చెప్పడం విశేషం.

అంతే కాదు తన యూనిట్ సభ్యులతో కూడా నయన్ ని చూపిస్తూ తనను చూస్తే మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టేనని అంత కమిట్మెంట్ తో మనమూ పని చేసినప్పుడు గొప్ప పేరు తెచ్చుకుంటామని చెప్పిందట. మొత్తానికి ఇప్పటిదాకా అంతగా ఎవరికి తెలియని సంగతులను కత్రినా షేర్ చేసేసరికి నయనతార అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మాములుగా సౌత్ నటీనటులంటే ఒక రకమైన అభిప్రాయం కలిగి ఉండే బాలీవుడ్ స్టార్స్ కి భిన్నంగా కత్రినా కైఫ్ ఇలా చెప్పడం గొప్ప విషయమని ఫ్యాన్స్ పొడగ్తలతో ముంచెత్తుతున్నారు. నయనతార ప్రస్తుతం రజనికాంత్ అన్నాతేతో సహా మొత్తం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉంది. లాక్ డౌన్ అయ్యాక ఇవి కొనసాగబోతున్నాయి

Jojobet GirişprimebahiscasibomjojobetcasibomcasibommariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet güncel girişjojobet giriş