LK Advani: BJP సీనియర్‌ నేత అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

బీజేపీ కురు వృద్ధుడు, ఉప ప్రధాని, సీనియర్‌ రాజకీయ నాయకుడు ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాలు..

బీజేపీ కురు వృద్ధుడు, ఉప ప్రధాని, సీనియర్‌ రాజకీయ నాయకుడు ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ వివరాలు..

బీజేపీ అగ్ర నేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన కుటుంబానికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో తాజాగా అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ప్రస్తుతం వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నారని.. ఆయన పరిస్థితిపై త్వరలోనే ప్రకటన చేస్తామని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనను అబర్వషేన్‌లో ఉంచామని తెలిపారు. నిపుణలైన వైద్యులు.. ఎప్పటికప్పుడు.. అద్వానీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 96 ఏళ్ల అద్వానీ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు.

ఇక కమలం పార్టీ బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరించడంలో దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయితో పాటు అద్వానీది కీలక పాత్ర. దాదాపు నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితంలో రథయాత్ర అన్నింటికి కన్నా ముఖ్యమైంది. ఈ యాత్ర ఆయనతో పాటు పార్టీని కూడా ప్రజలకు చేరువ చేసింది. రామ మందిరం నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి ఈ యాత్రే కారణం అని చెప్పవచ్చు. ఇక అద్వానీ రాజకీయ జీవితం విషయానికి వస్తే.. ఆయన  1999–2004 మధ్య ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా చేశారు. బీజేపీ అధ్యక్షునిగా కూడా పని చేశారు.

అయితే గత పదేళ్ల నుంచి అద్వానీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పార్టీ విధానాలు ఒక కారణం.. అలానే వయసు పైబడటంతో.. ఆయన శేష జీవితాన్ని కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈ ఏడాదే అద్వానీ భారతదేశ అత్యంత ప్రతి‍ష్టాత్మక పురస్కార.. భారతరత్న అందుకున్నారు. వయో భారం దృష్ట్యా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన నివాసానికి వెళ్లి ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని అందజేయడం తెలిసిందే. అద్వానీ త్వరగా కోలుకోవాలని పార్టీ నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఆయన త్వరగా ఆస్పత్రి డిశ్చార్జ్‌ కావాలని ప్రార్థిస్తున్నారు.

Show comments