iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: ఎల్ కే అద్వానికి భారత రత్న

  • Published Feb 03, 2024 | 11:51 AM Updated Updated Feb 03, 2024 | 12:23 PM

రాజకీయ కురు వృద్దుడు ఎల్ కే అద్వానికి ప్రతిష్టాత్మక అవార్డు అయిన భారత రత్న వరించింది.

రాజకీయ కురు వృద్దుడు ఎల్ కే అద్వానికి ప్రతిష్టాత్మక అవార్డు అయిన భారత రత్న వరించింది.

  • Published Feb 03, 2024 | 11:51 AMUpdated Feb 03, 2024 | 12:23 PM
బ్రేకింగ్: ఎల్ కే అద్వానికి భారత రత్న

ప్రజా జీవితంలో ఏడు దశాబ్దాలుగా ఉంటూ ఎన్నో సేవలు అందించారు లాల్ కృష్ణ అద్వానీ. ఆర్ఎస్ఎస్, బీజేపీ ద్వారా మాతృభూమికి ఆయన చేసిన సేవ, త్యాగం అసాధారణమైనవి. నిజాయితీగా రాజకీయాల్లో తనదైన మార్క్ చాటుకున్నారు.  అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఆయన చేసిన పోరాటం అనిర్వచనీయమైనదని అంటారు. ఆయన చేపట్టిన అయోధ్య రథయాత్ర అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గతంలో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పలువురు ప్రతిపాదనలు తీసుకువచ్చిన  విషయం తెలిసిందే. తాజాగా ఎల్ కే అద్వానికి భారత ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

బీజేపీ కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానికి భారత దేశంలో అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రధానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అద్వానీ సేవలు కొనియాడారు.  ‘ఎల్ కే అద్వానీజీ కి భారతరత్న ఇవ్వనున్న విషయం చెప్పడం చాలా సంతోషంగా ఉంది.. నేను ఆయనతో మాట్లాడి అభినందించాను. ఈ కాలంలో అత్యంత గౌరవనీయులైన రాజనీజ్ఞులలో ఆయన ఒకరు, మాతృభూమికి ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవి. అట్టడుగు స్థాయి నుంచి ఉప ప్రధానమంత్రి హోదాలో దేశానికి సేవ చేసే వరకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమైది. ఆయన హూం మంత్రి, I&B మంత్రిగా పదవీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.. గొప్ప అదృష్టవంతులు, నేను స్వయంగా ఆయనకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పినట్లు’ అంటూ ప్రధాని ట్విట్టర్ లో రాశారు.

రాజకీయ కురువృద్దుడు గా పిలిచే లాల్ కృష్ణ అద్వానీ.. 1927, జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచీ పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఇది పాకిస్థాన్ లో ఉంది. సంపన్నుల కుటుంబంలో పుట్టినప్పటికీ చిన్ననాటి నుంచి సేవా కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించేవారు. తన 15వ ఏటనే ఆర్ఎస్ఎస్ లో ప్రవేశించారు. 1967లో ఢిల్లీ మునసిపల్ కార్పోరేషన్ అధ్యక్షుడైనాడు.. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రి పదవిలో కొనసాగారు. 1980 లో బీజేపీ ఏర్పడిన తర్వాత పార్టీ అభివృద్దికోసం కీలక పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్ పేయి నేతృత్వంలో హూంశాఖ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం 15వ లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎల్ కే అధ్వానికి భారత రత్న రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.