iDreamPost
android-app
ios-app

మరిది కోసం పురందేశ్వ‌రి పాకులాట! షాక్ ఇచ్చిన BJP!

మరిది కోసం పురందేశ్వ‌రి పాకులాట! షాక్ ఇచ్చిన BJP!

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్.. రెండు తెలుగు రాష్ట్రల్లో సంచలనంగా మారింది. శనివారం నంద్యాలలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి విజయవాడలోని సిట్ కార్యలయంకి తీసుకెళ్లారు. అక్కడ సుదీర్ఘ సమయం పాటు బాబును అధికారులు విచారించారు. అయితే  చంద్రబాబు అరెస్ట్ పై వివిధ పార్టీలకు చెందిన నేతలు స్పందిస్తున్నారు. కొందరు చంద్రబాబు అరెస్ట ను సమర్ధించగా, మరికొందరు వ్యతిరేకించారు. బీజేపీ తరపు నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాత్రమే స్పందించారు. ఆమె కూడా చంద్రబాబుకు మద్దతుగానే, అరెస్ట సరైన క్రమంలో జరగలేదంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఒక అంశం మాత్రం అందరిలో అనుమానులు రేకేతిస్తుంది. ఆమె మరిది అయినా చంద్రబాబును కాపాడేందుకు పాకులాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

స్కీల్ డెలవలప్మెంట్ స్కాంలో  చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానంగా సరిగ్గా లేదని, ఆయనను అరెస్ట్ చేసే క్రమంలో నిబంధనలు పాటించలేదని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. అయితే ఆమె వ్యాఖ్యలకు పలువురు వైసీపీ మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి బావ జనత పార్టీ అని పెట్టుకోవాలి పురంధేశ్వరికి సూచించారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందని రాజకీయ విశ్లేషకలు అంటున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా బీజేపీ తరపున, జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఒక్క నేత కూడా స్పందించలేదు. కేవలం పురందేశ్వరి మాత్రమే బాబుకు మద్దతుగా మాట్లాడారు. పక్కరాష్ట్రంలోని బీజేపీ ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు అరెస్టను వ్యతిరేకించగ పోగా.. బలమైన ఆధారులు ఉంటేనే ఇలాంటి అరెస్టులు జరుగుతాయని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కేవలం బీజేపీ తరపు నుంచి పురందేశ్వరి మాత్రమే చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాట్లాడటం.. మరిదిని రక్షించేందుకు ఆమె పాకులాడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలానే ఆమెకు మద్దుతుగా బీజేపీ నుంచి కూడా ఎవరు మాట్లాడలేదు. అంటే చంద్రబాబు అరెస్ట్ విషయంలో నేతలు ఎవ్వరు స్పందించకుండా పురందేశ్వరికి బీజేపీ పరోక్షంగా షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అసలు జాతీయ స్థాయిలో అయితే బీజేపీ నేతలు ఈ అరెస్టు విషయం గురించి పట్టించుకున్నట్లు కూడా కనిపించలేదు. ఇలాంటి క్రమంలో తాను అధ్యక్షురాలిగా ఉన్న బీజేపీ నుంచి ఎవరు మాట్లాడక పోవడం.. అధిష్టానం ఆమెకు షాకిచ్చినట్లుగా ఉంది.  మరి.. బీజేపీ కూడా స్పందించిన చంద్రబాబు అరెస్ట్ విషయంలో..మరిది కోసం పురందేశ్వరి పాకులాడుందని వస్తున్న టాక్ పై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.