iDreamPost
android-app
ios-app

రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది? కాంగ్రెస్ ఎదురుదాడి

  • Published May 03, 2022 | 2:18 PM Updated Updated May 03, 2022 | 9:59 PM
రాహుల్‌ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియోలో తప్పేముంది? కాంగ్రెస్ ఎదురుదాడి

రాహుల్ గాంధీ మ‌ళ్లీ బీజేపీకి దొరికిపోయారు. ఆయన నేపాల్ నైట్ క్లబ్‌లో ఉన్న వీడియో బ‌యటకు రావడంతో బీజేపీ దుమారం రేపింది. నైట్ క్ల‌బ్ లో రాహూల్ అంటూ వైర‌ల్ చేయ‌డ‌మేకాదు, ఏకంగా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగింది. కాస్త తేరుకున్న‌ కాంగ్రెస్ నేత‌లు, అందులో తప్పేముందని ఎదురు ప్రశ్నించారు. పైగా మోడీలా పిలవని పేరంటానికి వెళ్లలేదని కౌంటర్ ఇచ్చారు.

నైట్ క్లబ్‌లో రాహుల్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్. జర్నలిస్ట్ స్నేహితుడు సుమ్నీమా ఉదాస్‌ పెళ్లికోసం రాహుల్ గాంధీ నేపాల్‌కు వెళ్లారు. ఆ స‌మ‌యంలో ఖాట్మాండులోని ఓ నైట్ పార్టీలో రాహుల్ గాంధీ కనిపించడంతో బీజేపీకి ఆయుధం దొరికిన‌ట్ల‌య్యింది. ఆ వీడియోలో రాహుల్ ప‌క్క‌న ఓ అమ్మాయి ఉన్నారు.

రాహుల్ గాంధీ వెళ్లినట్టు, ఓ హోటల్లో బస చేసినట్టు సుమ్నీ మా తండ్రి భూమ్ ఉదాస్ చెప్పారు. కాక‌పోతే రాహుల్‌తో పాటు ఉన్న ఆమె, నేపాల్‌లో చైనా దౌత్యవేత్త హౌ యాంకీ అని, గతంలో నేపాల్‌ ప్రధానిపైనా హనీట్రాప్ చేసిన విష‌యాన్ని బైట‌పెడుతున్నారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా రాహుల్ కు అండ‌గా వ‌చ్చారు. “రాహుల్ గాంధీ ఒక జర్నలిస్టు వివాహానికి నేపాల్‌కు వెళ్లారు. అందులో తప్పేమీలేదు. మన దేశ సంస్కృతికి సంబంధించినది. ఇది నేరమేమీ కాదు. బహుశా పీఎం, బీజేపీ త్వరలో వివాహాల్లో స్నేహితులు, బంధువులు పాల్గొనడం నేరమని నిర్ణయించవచ్చు” అని రణదీప్ సూర్జేవాలా ఎదురుదాడి చేశారు.

రాహుల్ గాంధీ ఒక్క‌రేకాదు, మరో ముగ్గురితో కలసి ఖాట్మాండుకు సోమవారం వెళ్లారు.సుమ్నీమా ఉదాస్‌ సీఎన్ఎన్‌లో జర్నలిస్టుగా పనిచేసేవారు. ఆయ‌న‌ రాహుల్ గాంధీ ఫ్రెండ్.