iDreamPost
android-app
ios-app

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే, కాసేప‌ట్లో ప్ర‌మాణ స్వీకారం, గంట‌లో మారిన బీజేపీ వ్యూహం

  • Published Jun 30, 2022 | 6:00 PM Updated Updated Jun 30, 2022 | 6:00 PM
మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే, కాసేప‌ట్లో ప్ర‌మాణ స్వీకారం, గంట‌లో మారిన బీజేపీ వ్యూహం

మహారాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే కొద్ది సేప‌ట్లో, రాత్రి 7.30 గంటలకు ప్ర‌మాణ‌ స్వీకారం చేయనున్నారు. ఇప్ప‌టిదాకా దేవేంద్ర ఫడ్నవీస్‌ సీఎం, ఏక్‌నాథ్‌ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అందరూ అనుకున్నారు. బీజేపీకూడా అలాంటి ఫీల‌ర్లే ఇచ్చింది. కాని, శివ‌సేన ను పూర్తిగా దెబ్బ‌తీయాలంటే ఏక్ నాథ్ షిండే ప‌ట్టంక‌ట్టాల‌ని బీజేపీ అధిష్టానం కీల‌క నిర్ణ‌యం తీసుకొంది. ఆమేర‌కు ఎర్పాట్లు మొద‌లైయ్యాయి. ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారణం చేయనున్నట్లు ఫడ్నవీస్‌ స్వయంగా ప్రకటించారు.

నిజంగా ఇది మ‌హారాజ‌కీయాల్లో ఇది పెద్ద ట్విస్ట్. ఉద్దవ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కూలదోసార‌న్న పేరురాకుండా, ఉద్ద‌వ్ మ‌ళ్లీ జ‌నంలోకి వెళ్లి సానుభూతి పొందకుండా బీజేపీ ముంద‌స్తు వ్యూహం ప‌న్నింది. ఇప్పుడు క‌నుక ప‌డ్న‌వీస్ ముఖ్య‌మంత్రి అయితే, శివ‌సేన వీధుల్లోకి వెళ్లి నిర‌స‌లు చేస్తుంద‌న్న‌ది మ‌రో అంచ‌నా. ఆ అవ‌కాశం ఇవ్వ‌కుండా, శివ‌సేన స‌ర్కార్ ను కూల‌గొట్టిన రెబ‌ల్ నేత‌నే సీఎంను చేయాల‌ని నిర్ణ‌యించింది. మహారాష్ట్ర సర్కార్‌ను బీజేపీ వెనకుండి నడిపించ‌నుంది. ఈ ఎర్పాటును ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డం మా ఉద్దేశం కాద‌ని, ఆయ‌న రాజీనామా మాకు సంతృప్తినివ్వ‌ద‌ని రెబల్ నాయ‌కులు ఇప్పటిదాకా చెప్పారు. ఒక్క‌సారిగా మాట మార్చారు. సీఎం పదివిని ఆశించలేదని , బీజేపీయే పెద్ద మనసుతో సీఎం పదవి ఇచ్చిందని ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. హిందుత్వ ఎజెండా కోసమే ఈ నిర్ణయ‌ని ప్ర‌క‌టించారు. ఉద్దవ్‌ ఠాక్రే మాకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేద‌ని, ఏక్‌నాథ్‌ షిండే అన్నారు.

అంతకుముందు గోవాలో త‌న రెబల్ ఎమ్మెల్యేల‌ను ఉంచి, తాను మాత్రం ప్రత్యేక విమానంలో ముంబై చేరిన ఏక్‌నాథ్‌ షిండే, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో చ‌ర్చించారు. ఇద్దరు కలిసి రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీని కలిశారు. ప్రభుత్వాన్ని ఎర్పాటుచేస్తామ‌ని చెప్పారు.