Idream media
Idream media
నిన్న మొన్నటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ పట్టు పట్టిన టి.డి.పి ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి వ్యతిరేక రాగం అందుకోవడం గమనార్హం. తమకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో ఏకంగా ఎన్నికలను బహిష్కరిస్తూనట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త రాజకీయాలు ఆవిష్కతమవుతున్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టిడిపి, బిజెపి, జనసేన పార్టీ లు ఇప్పుడు సరికొత్త పల్లవిని ఎత్తుకున్నాయి. తాజాగా నిర్వహిస్తున్న జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో టిడిపి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. బిజెపి, జనసేన కూడా టి.డి.పి బాటలోనే పయనించనున్నాయి. అవి కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాయి.
ఓటమి భయంతోనేనా..
గత ఏడాది పరిషత్ ఎన్నికలు వాయిదా పడటానికి ముందు చాలా చోట్ల ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయి. దీనిపై కి టిడిపి, బిజెపి, జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. పరిషత్ ఎన్నికల్లో ఆపిన చోట నుంచి కాకుండా తిరిగి మొదటి నుంచి నిర్వహించాలని కోరాయి. కానీ కోర్టు వారి వాదనను తోసిపుచ్చి తిరిగి యధావిధిగా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సంఘటన టిడిపికి మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి ఖాయం కావడంతో దానికన్నా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించకుండా ఉండడమే గౌరవప్రదంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయంపై ఆ పార్టీ సమావేశంలో చంద్రబాబు ముందుంచారు. చంద్రబాబు కూడా దీనిపై ఏకీభవించడంతో ప్రచారానికి వెళ్లకుండా తప్పుకొనున్నారు. అదే బాటలో బిజెపి జనసేన కూడా ఉన్నట్లు తెలుస్తుంది. శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తాము రావట్లేదని జనసేన అధినేత ప్రకటించడం గమనార్హం.
Also Read : చేతగాక కాదు.. కానీ పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం : చంద్రబాబు
ఇప్పటికే ఏపీలో పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. ఈ నెల 8న పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నారు. 10వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కొత్త ఎస్ఈగా బాధ్యతల చేపట్టిన వెంటనే నీలం సాహ్నీ ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టి.. అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు. ఈ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న టీడీపి సమావేశానికి సైతం హాజరుకాలేదు.
మరోవైపు ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ-జనసేన కూటమి సైతం హాజరు కాలేదు. మరి ఆ కూటమి అభ్యర్థులైనా ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారా లేదా అనేది వేచి చూడాలి.. ఒకవేళ టీడీపీలా, బీజేపీ-జనసేన కూటమి కూడా ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే.. వామపక్షాలు తప్పా మరే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించకుండా జరుగుతున్న ఎన్నికలుగా ఈ పరిషత్ పోరు రికార్డుల్లో నిలవనుంది.
ప్రతిపక్షాల తీరుపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా డిపాజిట్లు రావని.. అసలు విపక్షాల తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రావడం లేదని.. అందుకే ఇలా డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపిస్తున్నారు. కేవలం ఓటమి భయంతోనే టీడీపీ, బీజేపీ, జనసేనలు ఇలా ఎన్నికల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి అన్నారు. ప్రజలంతా సీఎం జగన్ సంక్షేమ పథాకాలకు ఆకర్షితులై ఓట్లు వేస్తున్నారని. ప్రజలు ఏకపక్షంగా గెలిపిస్తున్నప్పుడు అరాచకాలు చేయాల్సిన అవసరం తమకేం ఉందని అధికార పార్టీ నేతలు నిలదీస్తున్నారు.
ప్రధాన ప్రతిపక్షం ఆరోపణలు ఎలా ఉన్నా? ఎస్‌ఈసీగా భాద్యతలు చేపట్టిన నీలం సాహ్ని స్పీడు పెంచారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా జిల్లాల్లో కోవిడ్ పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి ఎస్ఈసీ తెలుసుకున్నారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలతో నీలం సాహ్ని సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కూడా టిడిపి బిజెపి నేతలు పాల్గొనలేదు.
Also Read : పరిషత్ ఎన్నికలపై కోర్టుకు బీజేపీ