iDreamPost
android-app
ios-app

వీడియో: పోలీసులను చూసి.. ప్రియురాలిని కిందపడేసి పారిపోయిన ప్రియుడు

వీడియో: పోలీసులను చూసి.. ప్రియురాలిని కిందపడేసి పారిపోయిన ప్రియుడు

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ప్రమాదలు జరుగుతున్నాయి. అలానే ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘిచడం వలన కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు  అనేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించిన వారిని పట్టుకుని చలాన్లు విధిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు…వింత చేష్టాలు చేస్తుంటారు. తాజాగా ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా తన ప్రియురాలినే రోడ్డుపై పడేసి..స్పీడ్ గా వెళ్లిపోయాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఇక వీడియోలో.. ఓ ప్రాంతంలోని రోడ్డు వాహనాలు, జనాలతో కిక్కిరిసిపోయింది. సిగ్నల్  పడ్డగానే అక్కడి వాహనాలు అన్ని నిలిచిపోయాయి. అదే దారిలో ఓ యువకుడు.. తన ప్రియురాలితో కలిసి బైక్ పై వస్తున్నాడు. అతడికి, వెనుక కూర్చుకున్న యువతికి హెల్మెట్లు లేవు. అంతేకాక వాహనానికి సరైన నంబర్ ప్లేట్ కూడా లేదు.  ఈ నేపథ్యంలో ఆ బైక్ ను అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసులు తనను పట్టుకోవడానికి వస్తున్నారని గమనించిన సదరు యువకుడు క్షణంలో తప్పించుకోవాలని ప్లాన్ చేశాడు.

పోలీసుల చేతికి చిక్కకుండా చలాన్ తప్పించుకోవాలని బైక్ యాక్సిలరేటర్ పెంచాడు. ఆ బైక్ ఒక్కసారిగా ముందుకు దూకింది. దీంతో బైక్ వెనుక ఉన్న ప్రియురాలు  కింద పడిపోయింది. ఆమెను గమనించని యువకుడు అలానే దూసుకెళ్లి.. ముందు వెళ్తున్న హోండా యాక్టివా స్కూటర్ ను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి  కూడా తప్పించుకుని మెరుపు వేగంతో పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. అతడు అయితే తప్పించుకున్నాడు.. కానీ కింద పడిన ప్రియురాలు అవమాన భారంతో పైకి లేచింది. ఆమెను ఓదార్చిన ట్రాఫిక్ పోలీసులు.. సమీపంలోని షాప్ వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి..నీరు ఇచ్చారు. ఈ వైరల్ వీడియో ఘటన కోల్‌కతాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై పలువురు సోషల్ మీడియా లో కామెంట్లు కూడా చేశారు.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌ గొప్ప నిర్ణయం.. వారి కోసం ఏకంగా రూ.100 కోట్లు