Idream media
Idream media
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంలో ఎన్‌డీఏ, మహాకూటమి మధ్య హోరాహోరి పోరు సాగగా.. కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ ఎన్‌డీఏ లీడింగ్‌లోకి వెళుతోంది. 243 సీట్లు గాను పూర్తి స్థాయిలో కౌటింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి ఎన్‌డీఏ కూటమి 122 సీట్లలో, మహాకూటమి 108 సీట్లలో అధిక్యంలో ఉన్నాయి. ఎల్‌జేపీ ఏడు, ఇతర పార్టీలు, స్వతంత్రులు మరో ఆరు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి.
మూడు దశల్లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ, జేడీయూ సహా మరో రెండు పార్టీలు కలసి పోటీ చేయగా.. మహాకూటమి పేరుతో కాంగ్రెస్, ఆర్‌జేడీ సహా ఇతర పార్టీలు బరిలో నిలిచాయి. జేడీయూతో విభేదించిన ఎల్‌జేపీ స్వతంత్రంగా పోటీలో నిలిచింది. 243 స్థానాలకు గాను 122 స్థానాలు గెలుచున్న కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం బిహార్‌లో జేడీయూ అధినేత నితీష్‌కుమార్ ముఖ్యమంత్రిగా ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది.