iDreamPost
iDreamPost
గత ఏడాది లాక్ డౌన్ ప్రభావం తగ్గుముఖం పట్టాక నిర్వహించిన బిగ్ బాస్ 4 సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కపెడితే విమర్శలకు ఎదురీదిన ప్రతి సారి మంచి రేటింగ్స్ తో బాగానే సాగుతోంది. షో డిజైన్ చేయడంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల హిందీ స్థాయిలో స్పందన లేదు కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే దీని స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాగార్జున ఈ ప్రోగ్రాం ని నడుపుతున్న విధానం చాలా మటుకు కాపాడుతోంది. సీజన్ 4 పూర్తయినప్పటి నుంచే స్టార్ మా ఛానల్ అయిదో సిరీస్ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. నాగ్ మరోసారి యాంకర్ పాత్ర పోషించడానికి ఒప్పుకున్నారు కూడా. ఈ సమ్మర్ లోనే స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో బిగ్ బాస్ 5 కొంత లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. 2020తో పోలిస్తే కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదట తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించనప్పటికీ మెల్లగా ఇక్కడా ఉదృతి పెరుగుతోంది. పరిస్థితి నైట్ కర్ఫ్యుల దాకా వెళ్ళింది. జనాలు పెద్దగా ఎంటర్ టైన్మెంట్ మూడ్ లో లేరు. ఎలాగూ థియేటర్లు సగం షోలతో జనం లేని హాళ్లతో బరువుగా నెట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 షూటింగ్ చేసే అనుకూలత లేదు. అందులోనూ 50 మందిని మించకుండా షూట్లు చేయాలనే నిబంధన కూడా ఉంది కాబట్టి ఇదంత ఈజీ కాదు.
సో బిగ్ బాస్ 5 అటుఇటుగా దసరా నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా ముందే అంటే ఛాన్స్ తక్కువే. ఇంకా పార్టిసిపెంట్స్ ని ఫైనల్ చేయలేదు. కొన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈసారి స్టార్ అట్రాక్షన్ పెంచేందుకు నిర్వాహక్కులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. కొందరిని లాక్ చేసినా కూడా పేర్లు బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నాలుగు సీజన్లతో పోలిస్తే ఈసారి షో ఇంకాస్త స్పైసిగా ఆసక్తికరంగా ఉండేలా గేమ్ ప్లాన్ మారుస్తున్నారట. లేట్ అయినా సరే ఈ సంవత్సరం బిగ్ బాస్ 5 ఉండటం ఖాయమే కానీ అభిమానులు కాస్త ఎక్కువగా ఎదురు చూడక తప్పదు మరి.