iDreamPost
android-app
ios-app

Bigg Boss OTT : కొత్త రూపంలో రాబోతున్న గేమ్ షో

  • Published Feb 08, 2022 | 8:22 AM Updated Updated Feb 08, 2022 | 8:22 AM
Bigg Boss OTT : కొత్త రూపంలో రాబోతున్న గేమ్ షో

అన్ని భాషలతో పోల్చుకుంటే తెలుగులోనే బిగ్ బాస్ షోకు కొంత స్పందన తక్కువగా ఉంది. హిందీలో సల్మాన్ ఖాన్ ఏకంగా పదమూడు సీజన్లు విజయవంతంగా హోస్ట్ చేయగా తమిళంలో కమల్ హాసన్ ని మార్చే అవసరమే లేదు. కానీ మన దగ్గర మాత్రం జూనియర్ ఎన్టీఆర్, నాని తర్వాత నాగార్జునతో సెటిల్ అయ్యారు. ఇక పార్టిసిపెంట్స్ విషయంలో వస్తున్న కంప్లైంట్స్ చూస్తూనే ఉన్నాం. మొన్న సీజన్ కు సోషల్ మీడియా బ్యాచ్ ని దింపడం గట్టిగానే ప్రభావం చూపించింది. సామాన్య ప్రేక్షకులకు వాళ్లెవరో తెలియక గేమ్ నడుస్తున్న విధానం నచ్చక వీక్ డేస్ లో తక్కువ రేటింగ్ ఇచ్చేశారు. సరే హిట్టు ఫ్లాపు వీటికీ సహజమే కాబట్టి కొత్త ప్లానింగ్ జరుగుతోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఓటిటిలో బిగ్ బాస్ లాంచ్ కాబోతోంది. ఫిబ్రవరి 26 నుంచి షోని అందుబాటులోకి తెస్తారట. శాటిలైట్ ఛానల్ లాగా రోజుకు రెండు గంటల లాగా కాకుండా ట్వంటీ ఫర్ అవర్స్ ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఇస్తారని వినికిడి. ప్రాక్టికల్ గా వినడానికి ఇది కష్టమే అనిపించినా అలాంటి ఇబ్బందేమీ రాకుండా షెడ్యూలింగ్ చేస్తారని తెలిసింది. గత అన్ని సీజన్లలో పాల్గొన్న వాళ్లే ఎక్కువగా ఉండొచ్చని వినిపిస్తోంది. పేర్లు ఇంకా బయటికి రాలేదు కానీ కొత్తవాళ్లను కూడా తీసుకొస్తారని అంటున్నారు. కాకపోతే మరీ వీర రేంజ్ సెలబ్రిటీలు ఉండకపోవచ్చని వినికిడి. నాగార్జునే దీనికీ హోస్టింగ్ చేయబోతున్నారు. ఎప్పటిలాగే వీకెండ్ ఎపిసోడ్స్ కు.

అయితే టీవీలో చూసినంతగా బిగ్ బాస్ ని ఓటిటిలో చూస్తారా అంటే చెప్పలేం. లైవ్ షో కాబట్టి మూడ్ వచ్చినప్పుడంతా హౌస్ లో ఏం జరుగుతోందన్న ఆసక్తి ఉన్న వాళ్ళు యాప్ ఓపెన్ చేసి స్ట్రీమింగ్ చేసుకుంటారు. లేదూ అంటే బోర్ కొట్టినప్పుడు మానేస్తారు. కానీ ఇరవై నాలుగు గంటలకు బదులు పరిమిత నిడివితోనే ఇది రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. హిందీలో కరణ్ జోహార్ ఆల్రెడీ ఓటిటి బిగ్ బాస్ ని రన్ చేశారు. అక్కడ ఈ షోకి ముందు నుంచి వీర ఫ్యాన్స్ ఎక్కువ కాబట్టి సమస్య రాలేదు. మరి అలవాటు లేని ఈ వ్యవహారాన్ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. ఎంతో దూరం లేదుగా. లెట్ సీ

Also Read : Beast : తగ్గేదేలే అంటున్న మరో పాన్ ఇండియా సినిమా