iDreamPost
android-app
ios-app

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. శివాజీ గెలుపు కోసం ఫ్యాన్స్‌ గొప్ప పని..

  • Published Dec 12, 2023 | 6:53 PM Updated Updated Dec 12, 2023 | 7:20 PM

Bigg Boss 7 Telugu - Shivaji: బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో ప్రముఖ నటుడు శివాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. బిగ్‌బాస్‌ గురించి ఎవరు మాట్లాడుకున్నా.. శివాజీ పేరు కచ్చితంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివాజీ గెలవాలని ఆయన ఫ్యాన్స్‌ ఓ గొప్ప పని చేశారు.

Bigg Boss 7 Telugu - Shivaji: బిగ్‌బాస్‌ సీజన్‌ 7లో ప్రముఖ నటుడు శివాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. బిగ్‌బాస్‌ గురించి ఎవరు మాట్లాడుకున్నా.. శివాజీ పేరు కచ్చితంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శివాజీ గెలవాలని ఆయన ఫ్యాన్స్‌ ఓ గొప్ప పని చేశారు.

  • Published Dec 12, 2023 | 6:53 PMUpdated Dec 12, 2023 | 7:20 PM
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. శివాజీ గెలుపు కోసం ఫ్యాన్స్‌ గొప్ప పని..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7కు మరి కొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ సీజన్‌లో ప్రముఖ నటుడు శివాజీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మొదటి ఎపిసోడ్ నుంచి శివాజీ స్ట్రాంగ్ హౌస్ మెట్‌గా.. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అంతేకాకుండా ఈ బిగ్ బాస్ హౌస్‌లో పెద్దమనిషి ఎవరూ అంటే.. ఠక్కున చెప్పే పేరు కూడా శివాజీదే. అంతలా హౌస్ లో అందరి మంచి చెడ్డల గురించి ఆలోచిస్తూ.. పెద్దరికం తీసుకుని మాట్లాడుతూ ఉన్నారు.

ఇకపోతే.. సహజంగా అభిమానులు తమకి ఇష్టమైన సెలబ్రిటీస్ బర్త్ డే సందర్భంగా రక్తదానం,అన్నదానం వంటి సేవ కార్యక్రమాలు చేయడం కామన్. కానీ, మొట్ట మొదటిసారి బిగ్ బాస్ షోలో పాల్గొన్న హీరో శివాజీని గెలిపించడం కోసం.. ఆయన అభిమానులు విన్నుతంగా ఆలోచించారు. ఫ్యాన్స్ చేసిన ఆ ఒక్క పనితో శివాజీ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

సాధారణంగా బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గెలవాలని బయట వారి ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉంటారు. తమ అభిమాన కంటెస్టెంట్స్ విన్నర్ అవ్వాలన్న ఉద్ధేశ్యంతో ప్రమోషన్స్‌ సైతం చేస్తుంటారు. అయితే, శివాజీ ఫ్యాన్స్‌ అందరికంటే భిన్నంగా ఆలోచించారు. బిగ్ బాస్ సీజన్7 లో పాల్గొన్న శివాజీ విన్నర్ గా గెలవాలని కొంతమంది ఆయన అభిమానులు‌‌ అనాథలకి అన్నదానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని శివాజీ అధికారిక సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ అవుతోంది.

దీంతో ఓట్ల కోసం శివాజీ ఫ్యాన్స్ కష్టపడినంత.. ఇంతకు ముందు ఎవ్వరూ కష్టపడలేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. శివాజీ ఫ్యాన్స్ చేసిన పనికి నెటిజన్లు సంతోషిస్తున్నారు. ఇలా అయినా శివాజీకి ఓట్లు వస్తే మేలని అభిప్రాయ పడుతున్నారు. శివాజీ అమరావతి రైతుల కోసం ఎంతగానో కష్టపడ్డారని, అలాంటి వ్యక్తికి ఓట్లు వేసి బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ చేయమని సోషల్ మీడియా వేదికగా మెసేజ్‌లు చేస్తూ కోరుతున్నారు.  కాగా, బిగ్ బాస్ హౌస్‌లో టాప్ ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.

అందులో.. ముందుగానే ఫినాలే అస్త్రా సాధించి ఫైనల్స్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు అంబటి అర్జున్. ఆ తర్వాత ప్రియాంక, యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ కూడా ఫైనలిస్ట్స్‌గా నిలిచారు. అయితే ఈ ఆరుగురి మధ్య ఓటింగ్ విషయంలో ఇప్పటికే పోటీ మొదలయ్యింది. ఈ క్రమంలో.. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి, ఎవరు బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అవుతారు అనే ఆసక్తి అందరిలోనూ మొదలయ్యింది. మరి, శివాజీని గెలిపించడం కోసం ఫ్యాన్స్ చేసిన పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ACTORSHIVAJI (@actorshivajioffical)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş