iDreamPost
iDreamPost
శాటిలైట్ ఛానల్ లో హల్చల్ చేసిన బిగ్ బాస్ షో త్వరలో ఓటిటిలో రాబోతున్న సంగతి తెలిసిందే. డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఈ నెలాఖరు నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా 24 గంటల పాటూ రోజూ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ ని ప్లాన్ చేయడం విశేషం. డిజిటల్ ఆప్షన్ కాబట్టి అభిమానులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాపీగా చూసుకోవచ్చు. హిందీలో ఆల్రెడీ కొంతమేరకు వర్కౌట్ అయిన ఈ బిగ్ బాస్ ఓటిటి తెలుగులో ఏ మేరకు సక్సెస్ అవుతుందనే దాని మీద విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం కంటెంట్ కి లిమిట్స్ ఉండవు కాబట్టి చాలా ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు
ఇక ఈ షోకు సంబందించిన పార్టిసిపెంట్స్ లిస్టు బయటికి వస్తోంది. వీళ్లేనా కాదా అనేది ఖచ్చితంగా చెప్పలేం కానీ టీవీ వర్గాల్లో మాత్రం ప్రచారం జరుగుతోంది. వాటి ప్రకారం ఆదర్శ్ బాలకృష్ణ, నటరాజ్ మాస్టర్, అరియనా, సరయు, మహేష్ విట్ట, ఆశు రెడ్డి, అఖిల్, తేజస్విని,యాంకర్లు శివ స్రవంతి, కొత్త హీరో అర్జున్ తదితరులు ఈ లిస్టులో ఉన్నారట. వీళ్ళలో అధిక శాతం గత సీజన్లలో పాల్గొన్నవాళ్ళే. ఎలాగూ ఎక్స్ పీరియన్స్ ఉంది కాబట్టి ఎలాంటి హద్దులు లేని ఈ షోని ఎలా పండించాలో వాళ్లకు బాగా ఐడియా ఉంటుంది. కొంతబోల్డ్ గా వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇది ఉంటేనే ఓటిటి ఆడియన్స్ ఎక్కువగా చూసే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ ఈ ఫార్మట్ కనక సక్సెస్ అయితే టీవీతో పాటు ఓటిటి షోని కూడా కంటిన్యూ చేయబోతున్నారు. నాగార్జున డిజిటల్ గేమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక ట్రెండ్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. హాట్ స్టార్ వేదికగా ఈ బిగ్ బాస్ ఓటిటి రానుంది. సినిమాలు, వెబ్ సిరీస్ లు, సెలబ్రిటీ టాక్ షోలే కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ద్వారా కూడా సబ్స్క్రైబర్స్ ని పెంచుకునే ఆలోచనలు చేస్తున్నాయి డిజిటల్ సంస్థలు. వీటికి వచ్చే స్పందన బట్టి భవిష్యత్తులో మిగిలిన ఓటిటిలో కూడా ఇలాంటి ఆటలు తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఎంటర్ టైన్మెంట్ కొత్త కొత్త రూపాలను సంతరించుకుంటోంది
Also Read : Ghani : బాబాయ్ తేదీని అబ్బాయ్ తీసుకున్నాడు