iDreamPost
android-app
ios-app

త్వరలో బిగ్ బాస్ కొత్త సీజన్.. తొలి కంటెస్టెంట్ ఎవరో  చెప్పేశారు! 

  • Published Jun 19, 2024 | 4:56 PM Updated Updated Jun 19, 2024 | 4:56 PM

Vada Pav Girl: బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. ఇలా బిగ్ బాస్ కోసం ఆసక్తిగా చూసే వారి.. ప్రతి సారి కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించి ఓ బిగ్ అప్ డేట్ వచ్చింది.

Vada Pav Girl: బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. ఇలా బిగ్ బాస్ కోసం ఆసక్తిగా చూసే వారి.. ప్రతి సారి కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ షోకు సంబంధించి ఓ బిగ్ అప్ డేట్ వచ్చింది.

  • Published Jun 19, 2024 | 4:56 PMUpdated Jun 19, 2024 | 4:56 PM
త్వరలో బిగ్ బాస్ కొత్త సీజన్.. తొలి కంటెస్టెంట్ ఎవరో  చెప్పేశారు! 

ప్రేక్షకులను ఎన్నో రకాల షోలు ఎంటర్టైన్ చేస్తుంటాయి. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ఆడియన్స్ ను అలరిస్తుంటాయి. అలాంటి వాటిల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో ఈ షో ప్రసారం అవుతుంది. తెలుగుతో సహా అనేక ఇతర భాషాల్లో ఈ షో విజయవంతంగా సాగుతోంది. ఇప్పటికే పలు సీజన్ లు పూర్తి చేసుకుని..త్వరలో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే బిగ్ బాస్ ఓటీటీ కూడా ప్రారంభమైన సంగతి తెలిసింది. త్వరలో ప్రసారం కానున్న బిగ్ బాస్ ఓటీటీకి తొలి కంటెస్టెంట్ ఎవరు అనే విషయం రివీల్ అయింది. మరి..ఆ యువతి ఎవరు, అసలు బిగ్ బాస్ ఓటీటీ ఎప్పటి నుంచి ప్రారంభం, ఆవిషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…

బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోను ఇష్టపడే జనాలు చాలామందే ఉన్నారు. ఇలా బిగ్ బాస్ కోసం ఆసక్తిగా చూసే వారి.. ప్రతి సారి కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి. తెలుగు విషయానికి వస్తే..ఇప్పటి వరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుని, ఎనిమిదో సీజన్ కి రెడీ అవుతుంది. అలానే హిందీలో కూడా బిగ్‌బాస్‌ షో.. 17 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. షో ప్రాంరంభం కాగానే సంతోష పడే బిగ్‌బాస్‌ ప్రియులు ఫినాలే వచ్చేసరికి అప్పుడే అయిపోయిందా నిరుత్సాపడుతుంటారు. అందుకే అలాంటి వారి కోసం నిర్వాహకులు ఓటీటీ సీజన్‌ను ప్రవేశపెట్టారు. టీవీలో కాకుండా కేవలం ఓటీటీలో మాత్రమే ఈ షో  చేసే అవకాశం ఉందనే విషయం మీకు తెలిసిందే.

Who was the first contestant 02

ఇప్పటికే హిందీలో రెండు బిగ్ బాస్ ఓటీటీ సీజన్లు పూర్తయ్యాయి. తాజాగా మూడో సీజన్ కి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి సల్మాన్‌ ఖాన్‌కు బదులుగా స్టార్‌ నటుడు అనిల్‌ కపూర్‌ను వ్యాఖ్యతగా తీసుకున్నారని తెలుస్తోంది. ఈ  సీజన్ లో తొలి కంటెస్టెంట్‌ ఈవిడే అంటూ బిగ్‌బాస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జియో సినిమా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్‌ చేసింది. ఆ ఫోటోలో ఓ చిన్న స్నాక్స్‌ బండి దగ్గర జనం గుమిగూడి ఉన్నారు.  ఈఫోటోను చూసిన నెటిజన్లు.. ఆమె ఫేమస్‌ వడాపావ్‌ గర్ల్‌ చంద్రిక అని కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీలోని వీధుల్లో వడాపావ్‌ అమ్ముతూ చంద్రిక ఫేమస్ అయ్యింది. బయట అందర్ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ షోలో క్లిక్‌ అవుతుందో, లేదో చూడాలి. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌ జూన్‌ 21 నుంచి ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ పార్టనర్ జియో సినిమాలో వీక్షించ వచ్చు.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş