iDreamPost
android-app
ios-app

హర్షసాయి కేసులో ట్విస్ట్‌.. మరోసారి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు!

  • Published Sep 26, 2024 | 6:33 PM Updated Updated Sep 26, 2024 | 6:33 PM

Youtuber Harsha Sai: ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పపడినట్లు ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది.

Youtuber Harsha Sai: ప్రేమ పేరుతో లోబర్చుకొని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పపడినట్లు ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి పై ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది.

  • Published Sep 26, 2024 | 6:33 PMUpdated Sep 26, 2024 | 6:33 PM
హర్షసాయి కేసులో ట్విస్ట్‌.. మరోసారి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు!

ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రెండు సంచలన రేపిన కేసులు దర్యాప్తు కొనసాగుతుంది. లైంగిక దాడి కేసులో అరెస్ట్ అయి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ సంబంధించిన కేసు ఒకటి, యూట్యూబర్ హర్షసాయి తనను ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసి మత్తు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు హర్షసాయి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వైపు విచారణ జరుపుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సదరు బాధితురాలు హర్షసాయిపై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇప్పటికే హర్షసాయి తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు చేసిన యువతి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాయర్ తో కలిసి తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లైంగిక ఆరోపణలతో హర్ష సాయి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న సదరు యువతి  మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పపడ్డాడని.. అలాగే తన వద్ద రూ.2 కోట్లు తీసుకొని మోసం చేశాడని నార్సింగ్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదిలా ఉంటే హర్ష సాయి అడ్వకేట్ వర్షన్ మరోలా ఉంది.. సదరు యువతి హర్ష సాయిని డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తుందని, అతని పాపులారిటీ దెబ్బతీయాలనే ఆలోచనలో ఉందని వాదిస్తున్నారు. మెగా సినిమా కాపిరైట్ విషయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా లాయర్ ద్వారా మెయిల్స్ పంపుతూ భయాందోళనకు గురి చేస్తున్నాడని పోలీసులను మరోసారి ఆశ్రయించింది. బాధితురాలు వరుస ఫిర్యాదులతో పోలీసులు ఈ కేసును మరింత స్పీడప్ చేశారు. ఏ క్షణంలో అయినా సరే యూట్యూబర్ హర్ష సాయిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmeritbet girişgrandpashabet