iDreamPost
android-app
ios-app

వీడియో: తన రెండో భార్యపై కామెంట్స్.. బిగ్ బాస్ హౌస్ లో చెంప పగలగొట్టిన యూట్యూబర్!

  • Published Jul 08, 2024 | 11:24 AM Updated Updated Jul 08, 2024 | 11:24 AM

Armaan Malik Slapped- Vishal Pandey In Bigg Boss House: బిగ్ బాస్ షోకి ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ ముఖ్యంగా హిందీలో అయితే అది మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆట కూడా ఇదిగో ఇలాగే కాస్త ఘాటుగానే ఉంటుంది. హౌస్ లో ఒక కంటెస్టెంట్ తోటి కంటెస్టెంట చెంప పగలకొట్టేశాడు.

Armaan Malik Slapped- Vishal Pandey In Bigg Boss House: బిగ్ బాస్ షోకి ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ ముఖ్యంగా హిందీలో అయితే అది మరీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆట కూడా ఇదిగో ఇలాగే కాస్త ఘాటుగానే ఉంటుంది. హౌస్ లో ఒక కంటెస్టెంట్ తోటి కంటెస్టెంట చెంప పగలకొట్టేశాడు.

  • Published Jul 08, 2024 | 11:24 AMUpdated Jul 08, 2024 | 11:24 AM
వీడియో: తన రెండో భార్యపై కామెంట్స్.. బిగ్ బాస్ హౌస్ లో చెంప పగలగొట్టిన యూట్యూబర్!

భాషతో సంబంధం లేకుండా బిగ్ బాస్ షోని స్టార్ట్ చేసిన అన్ని భాషలో అఖండ విజయాన్ని సాధించింది. అదే జోష్ తో కంటిన్యూ అవుతోంది. అయితే సౌత్ తో పోలిస్తే హిందీ బిగ్ బాస్ కు ప్రేక్షకాదరణ ఎక్కువ. బిగ్ బాస్ ను పెద్దఎత్తున ఫాలో అవుతూ ఉంటారు. అంత ఆదరణ ఉంది కాబట్టే అక్కడ ఇప్పటికే 17 సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఇటీవలే ఓటీటీ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తోంది. అయితే అక్కడికి వచ్చే కంటెస్టెంట్స్ దాదాపుగా ఫైర్ బ్రాండ్లు, కాస్తో కూస్తో కాంట్రవర్సీని క్రియేట్ చేయగలిగిన వాళ్లనే పంపిస్తారు. మన షోలతో పోలిస్తే అక్కడ కాస్త ఆట ఘాటుగానే ఉంటుంది. అది ఇప్పుడు మరో స్థాయికి చేరుకుంది. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట చెంప పగలగొట్టాడు.

బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ భార్యా సమేతంగా వచ్చాడు. అంటే మొత్తంగా ముగ్గురు వచ్చారనమాట. అంటే అర్మాన్ కి ఇద్దరు భార్యలు. అయితే ఇటీవలే మొదటి భార్య పాయల్ షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే ఆమెను వీకెండ్ కా వార్ ఎపిసోడ్ లో అతిథిగా తీసుకొచ్చారు. ఆమె హౌస్ లోకి వచ్చీ రావడంతోనే హౌస్ మేట్ యూట్యూబర్ విశాల్ పై విజృంభించింది. ఆమె విశాల్.. కృతిక గురించి చేసిన కామెంట్స్ ని లేవనెత్తింది. విశాల్ మరో కంటెస్టెంట్ చెవిలో కృతిక ఒదిన బాగుంటుంది అని గుసగుసలాడాడు. అదే విషయాన్ని పాయల్ ప్రశ్నించింది. అందుకు విశాల్ తాను చెడు ఉద్దేశంతో చెప్పలేదు అని సమర్థించుకున్నాడు.

Arman malik

తప్పుడు ఉద్దేశం లేకపోతే నేరుగా ఆమెకే చెప్పాల్సింది కదా అని నిలదీసింది. విశాల్ నువ్వు ఒక భార్య, ఒక తల్లి గురించి మాట్లాడుతున్నావ్ అది మర్చిపోవద్దు. ఆ విషయాన్ని కాస్త దృష్టిలో ఉంచుకుని మాట్లాడు అంటూ పాయల్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇంక ఈ విషయం తెలుసుకున్న అర్మాన్ విశాల్ దగ్గరకు వస్తాడు. అసలు ఏం అన్నావ్ అని ప్రశ్నిస్తాడు. అందుకు విశాల్ కృతిక ఒదిన బాగుంటుంది అని అన్నాను అని చెప్తాడు. విశాల్ సమాధానంతో అర్మాన్ కోపంతో ఊగిపోయాడు. వెంటనే విశాల్ చెంప పగలగొట్టాడు. అది చూసిన కంటెస్టెంట్స్ కి కాసేపు ఏమీ అర్థం కాలేదు. వెంటనే వాళ్లిద్దరని దూరంగా తీసుకెళ్లిపోయారు.

ఈ విషయం ఇప్పుడు నెట్టింట, అలాగే బీ టౌన్ లో బాగా వైరల్ అవుతోంది. అర్మాన్- విశాల్ ని కొట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది విశాల్ కే సపోర్ట్ చేస్తున్నారు. అతను ఒదిన అని అనే కదా సంభోదించాడు. కృతిక ఒదిన బాగుంటుంది అని చెప్పాడు. అందులో ఏమైనా తప్పు ఉందా అని నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. అలాగే అర్మాన్ ను వెంటనే హౌస్ నుంచి పంపేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఏ కంటెస్టెంట్ కూడా మరొకరిపై భౌతిక దాడికి దిగకూడదు. మరి.. తన రెండో భార్యని అన్నాడని కంటెస్టెంట్ ని కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Bigg Boss ott 3 Khabri (@biggbossott3.tazakhabar)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş