P Krishna
Divya Agarwal Marriage Pics: వెండితెర, బుల్లితెరకు చెందిన నటీనటులు వరుసగా వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో నెట్టింట్ సందడి చేస్తున్నాయి.
Divya Agarwal Marriage Pics: వెండితెర, బుల్లితెరకు చెందిన నటీనటులు వరుసగా వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో నెట్టింట్ సందడి చేస్తున్నాయి.
P Krishna
ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది.. వెండితెర, బుల్లితెర నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు వరుసగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. చాలా మంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. కొంతమంది మంది పెద్దలు కుదర్చినవారితో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్-1 తో అందరి దృష్టి ఆకర్షించిన కంటెస్టెంట్ దివ్య అగర్వాల్ తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లి చేసుకొని వైవాహికబంధంలోకి అడుగు పెట్టింది. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 17 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీలోకి కూడా తెగ సందడి చేసింది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ – 1 లో దివ్య అగర్వాల్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఓటీటీ సీజన్ లో దివ్య విజేతగా నిలిచింది. తాజాగా దివ్య అగర్వాల వివాహబంధంలకి అడుగు పెట్టింది. తన ప్రేమికుడు, వ్యాపార వేత్త అపూర్వ పడ్గాంకర్‌తో తో ఏడడుగులు నడిచింది. ముంబాయిలో చెంబూర్ లో జరిగిన వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. ఈ జంట 2022 లోనే నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ వివాహం ఇప్పుడు చేసుకున్నారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియో తన ఇన్‌స్టాలో పంచుకుంది బిగ్ బాస్ బ్యూటీ.
ఈ జంట వివాహం ముందు వేడుకలో కాక్ టెయిల్ పార్టీతో ప్రారంభం అయ్యింది. మెహందీ, హల్దీ వేడుకలు చాలా ఘటనంగా జరిగాయి. పెళ్లికి బాలీవుడ్ సెలబట్రెటీలు జియా శంకర్, నైరా బెనర్జీ, ఇజాజ్ ఖాన్, అలీ మర్చంట్, రోహిత్ వర్మ, శార్దూల్ పండిత్, నిక్కి తంబోలి, విశాల్ ఆదిత్య సింగ్ హాజరయ్యారు. ఇక దివ్య అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే.. హరర్ వెబ్ సీరీస్ రాగిని ఎంఎంఎస్ రిటర్న్-2 తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంటీవీ సీజన్ – 10 రన్నరప్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్ -1 విన్నర్ గా నిలిచింది. ఎస్ ఆఫ్ స్పేస్ సీజన్ -1 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుంది. సెలబ్రెటీలు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.