iDreamPost
android-app
ios-app

Rathika Rose: రతికాకి బిగ్ బాస్ కాల్? ఆట మరింత మారబోతోందా?

  • Published Oct 06, 2023 | 5:45 PM Updated Updated Oct 06, 2023 | 5:45 PM
  • Published Oct 06, 2023 | 5:45 PMUpdated Oct 06, 2023 | 5:45 PM
Rathika Rose: రతికాకి బిగ్ బాస్ కాల్? ఆట మరింత మారబోతోందా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట ఆసక్తిగా సాగుతోంది. ముఖ్యంగా ఫస్ట్ కెప్టెన్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు అంటూ వార్తలు వస్తుండటంతో ప్రేక్షకులు వావ్ అనేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఫస్ట్ కెప్టెన్ అయ్యి.. సూపర్ ఇమ్యునిటీని సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ వీక్ గ్రాండ్ లాంఛ్ కూడా ఉంది. కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి రాబోతున్నారు. అందుకే ఈ వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అంబటి అర్జున్, పూజా మూర్తి, భోలే షావలే, నయని పావని, కెవ్వు కార్తిక్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో హీరోయిన్ రతికా రోజ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యిందనే చెప్పాలి. హౌస్ లో లేకపోయినా కూడా ఇప్పటికీ ఆమె గురించి చర్చ జరుగుతూనే ఉంది. హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత రతికా రోజ్ బిగ్ బాస్ గురించి పెద్దగా స్పందించింది కూడా లేదు. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం శివాజీ- ప్రశాంత్ సంభాషణ పోస్ట్ చేసి.. వాళ్లని మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ సీజన్ రతికా రోజ్ చాలానే డ్యామేజ్ చేసింది. తన ప్రణాళికలు బెడిసి కొట్టాయి. మంచి చేయకపోగా.. చెడును చేశాయి. అయితే ఇప్పుడు నెట్టింట ఇంకో కొత్త ప్రచారం బాగా వినిపిస్తోంది. అదేంటంటే.. రతికా రోజ్ కు బిగ్ బాస్ కాల్ వచ్చిందని చెబుతున్నారు. మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ రాబోతోంది అంటూ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి బజ్ నడుస్తున్న విషయం నిజమే.

రతికా రోజ్ మాత్రం మళ్లీ ఈ సీజన్ రాదనే చెప్పాలి. అయితే బిగ్ బాస్ కాల్ వచ్చింది మాత్రం ఈ సీజన్ కోసం కాదంట. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ 2 కోసం రతికా రోజ్ కి ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పూర్తైన తర్వాత ఓటీటీ సీజన్ 2 ప్రారంభం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచే ఎవరిని సెలక్ట్ చేయాలి అని యాజమాన్యం కసరత్తు షురూ చేసినట్లు చెబుతున్నారు. ఇంక గ్రాండ్ లాంచ్ 2.0 గురించి చూస్తే.. ఆదివారం 7 గంటలకు మెయిన్ లాంఛ్ ఈవెంట్ లాగానే ఈ 2.0 కూడా ఉంటుందని చెబుతున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే నాగార్జున వెల్లడించారు. చిన్న ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే అందులో హమీదా, యావర్ వంటి పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంట్రీ సీన్లనే మాత్రమే చూపించారు. ఎందుకంటే ఇంకా షూట్ పూర్తి కాలేదని చెబుతున్నారు. మరి.. బిగ్ బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş