iDreamPost
android-app
ios-app

అఫీషియల్: బిగ్ బాస్ OTT కొత్త సీజన్ వచ్చేస్తోంది.. మారిపోనున్న హోస్ట్!

Official Announcement On Bigg Boss OTT New Season: బుల్లితెర ప్రేక్షకులు, నెజిజన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే ఈసారి బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్ కూడా మారబోతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Official Announcement On Bigg Boss OTT New Season: బుల్లితెర ప్రేక్షకులు, నెజిజన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ఓటీటీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే ఈసారి బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్ కూడా మారబోతున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అఫీషియల్: బిగ్ బాస్ OTT కొత్త సీజన్ వచ్చేస్తోంది.. మారిపోనున్న హోస్ట్!

హాలీవుడ్ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకుని బిగ్ బాస్ రియాలిటీ షోగా ఇండియాలోకి తీసుకొచ్చారు. నిజానికి ఈ షో ఏ భాషలో అయితే స్టార్ట్ ఆ భాషలో సూపర్ సక్సెస్ అయ్యింది. అన్ని భాషల్లో మోస్ట్ వ్యూవర్ షిప్, ఫ్యాన్ బేస్ ఉన్న షోగా ప్రేక్షకాదరణ పొందింది. అటు తెలుగులో కూడా ఈ షోకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే తెలుగులో 7 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అలాగే ఒక ఓటీటీ సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇంక హిందీలో అయితే ఈ బిగ్ బాస్ కి విశేష ఆదరణ ఉంది. ఇప్పుడు హిందీలో కొత్త ఓటీటీ సీజన్ కూడా స్టార్ట్ కాబోతోంది. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా.. ఈసారి హోస్ట్ ని కూడా మార్చేస్తున్నారు.

బిగ్ బాస్ షోకి బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ఉంది. ఈ బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారికి బయట మంచి ఫాలోయింగ్ పెరగడమే కాకుండా.. ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తాయి. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ బేస్ పెరిగిపోతుంది. అందుకే ఈ బిగ్ బాస్ షోకి వెళ్లేందుకు అంతా ఉవ్విళ్లూరుతూ ఉంటారు. ఆ షోలో పాల్గొనే ఛాన్స్ వస్తే.. భారీగా రెమ్యూనరేషన్ దక్కడమే కాకుండా.. షాస్ట్ గా ఫేమస్ కూడా అయిపోతారు. ఇలాంటి ఈ బిగ్ బాస్ షోకి 2010 నుంచి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకి కొత్త హోస్ట్ ని చూడబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి.

అది కూడా కొత్త సీజన్ స్టార్ట్ అవుతోంది అని ప్రకటించిన తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ కూడా మారబోతున్నాడు అంటూ చెబుతున్నారు. అయితే ఇది మెయిన్ సీజన్ కి కాదులెండి. బిగ్ బాస్ ఓటీటీలో కొత్తగా సీజన్ 3 రాబోతోంది అంటూ జియో సినిమా వాళ్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాతే ఈ హోస్ట్ ఛేంజ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి అనీల్ కపూర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు అంటూ చెబుతున్నారు.

అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న హోస్ట్  ఛేంజ్ వార్త అధికారిక ప్రకటన కాదు. అలాగే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం చెప్పలేదు. కానీ, త్వరలోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ప్రస్తుతం కంటెస్టెంట్స్ వేటలో ఉన్నారని తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 3ని చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ వార్తల నేపథ్యంలో తెలుగు ఆడియన్స్ మరి.. బిగ్ బాస్ ఓటీటీ తెలుగు సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సంగతి ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by JioCinema (@officialjiocinema)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి