iDreamPost
android-app
ios-app

దారుణంగా మోసపోయానంటూ బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి రావు ఆవేదన

ఆన్ లైన్ మోసాలే కాదూ.. ఇప్పుడు ఈ తరహా ఫ్రాడ్ కూడా పుట్టుకు వచ్చింది. ఇలాంటి మోసాల బారిన సామాన్యులే కాదూ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె వీడియో చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఆన్ లైన్ మోసాలే కాదూ.. ఇప్పుడు ఈ తరహా ఫ్రాడ్ కూడా పుట్టుకు వచ్చింది. ఇలాంటి మోసాల బారిన సామాన్యులే కాదూ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె వీడియో చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

దారుణంగా మోసపోయానంటూ బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి రావు ఆవేదన

ఇటీవల కాలంలో ఫ్రాడ్స్ ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలైతే.. కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మీ మొబైల్ నంబర్‌కు కొన్నికోట్లు వచ్చాయంటూ పేర్కొన్న లింకుపై క్లిక్ చేయమంటూ సందేశాలు వస్తాయి. అంతేనా.. ఫోన్లు చేసి మరీ చోరీ చేస్తున్నారు కేటుగాళ్లు. బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని లేదా బంఫర్ ప్రైజ్ తగిలిందంటూ కాల్స్ చేసి డబ్బులు కొల్లగొడుతుంటారు. మన చేతితోనే మన కళ్లను పొడిచేస్తుంటారు. మోసం జరిగిందని తెలిసే లోపే.. పరిస్థితి చేయి దాటి పోతుంది. జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. సైబర్ నేరగాళ్లకు ఫిర్యాదు చేసినా.. డబ్బులు వెనక్కు వచ్చే దాఖలాలు చాలా తక్కువ. సామాన్యులే కాదూ సెలబ్రిటీలు కూడా మోసాల బారినపడుతున్నారు.

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ నటి ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తాను మోసపోయానంటూ ఓ వీడియోను చేసి అలర్ట్ చేశారు. ఆ నటి ఎవరంటే.. ఆరోహి రావు. టీవీ9 న్యూస్ యాంకర్‌గా పాపులర్ అయిన ఈ వరంగల్ ముద్దుగుమ్మ.. అనేక ఛానల్స్‌లో పనిచేశారు.  టీవీ 9లో ప్రసారమయ్యే ఇస్మార్ట్ న్యూస్ ప్రోగ్రాం.. ఆమెకు మంచి పేరు తెచ్చింది. అంతక ముందు ఐ5 నెట్ వర్క్, పొలిటికల్ బెంచ్, తుపాకీ, స్టూడియో న్యూస్, స్టూడియో వన్ వంటి ఛానల్స్‌లో వర్క్ చేసింది ఆరోహి. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. తెలంగాణ యాసలో మాట్లాడంలో దిట్ట. దీంతో ఆమెకు యాంకర్‌గా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి. ఆమె పాపులర్ కావడంతో బిగ్ బాస్ 6లో ఎంట్రీ ఇచ్చింది.

సుమారు నాలుగు వారాల పాటు బిగ్ బాస్ హౌస్6లో సందడి చేసింది. అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. అయితే తాజాగా ఆమె ఓ ఫ్రాడ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీ షో (Meesho) తనను దారుణంగా మోసం చేసిందంటూ అసంతృప్తిని వ్యక్తం చేసింది ఆరోహి. ‘నాలుగు రోజుల క్రితం ఆర్డర్ వచ్చింది. ఫ్లిప్ కార్ట్, మీ షో రెండింటిలో ఆర్డర్ పెట్టి ఉంటానని అనుకున్నాను. ఆన్ లైన్ పేమెంట్ చేసేశాను. తీరా ఫోన్ చెక్ చేసుకోగా.. ఆ రెండింటిలోనూ ఆర్డర్ పెట్టలేదు. డౌట్ వచ్చి.. ఈ కామ్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ బాయ్ కు కాల్ చేసి ఎక్కడి నుండి డెలివరీ వచ్చిందని అడిగితే.. మీషో అని చెప్పాడు.

వెంటనే మీషో యాప్ హెల్ప్ సెంటర్‌కు కాల్ చేసి.. పెట్టని ఆర్డర్ వచ్చిందని, నా డబ్బులు రీఫండ్ చేస్తారా అని అడిగా. 72 గంటల్లో మీ టికెట్ రేజ్ చేశాం. మెయిల్ వస్తుందని చెప్పారు.. నాలుగు రోజులైంది ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. నాకు ఆ ఆర్డర్ లో కేవలం ఓ క్లాత్ ముక్క వచ్చింది. ఇది టోటల్‌గా మీ షో చేస్తున్న ఫ్రాడ్. ఎప్పుడైనా ఆర్డర్స్ వస్తే చాలా జాగ్రత్తగా అమౌంట్ పే చేయండి. మీ షో, ఇతర కంపెనీల నుండి కూడా అనేక మంది ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు తెలిసింది. జాగ్రత్తగా ఉండండి’ అంటూ చెప్పారు. ఇలాంటి మోసాల పట్ల అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Arohi Rao (@arohi_rao)