iDreamPost
android-app
ios-app

రాజ్యంలో రాజులు – ఇక ప్రేక్షకులే జడ్జీలు

  • Published Dec 08, 2020 | 6:49 AM Updated Updated Dec 08, 2020 | 6:49 AM
రాజ్యంలో రాజులు – ఇక ప్రేక్షకులే జడ్జీలు

అవినాష్ వెళ్ళిపోయాక ఇక మిగిలిన వాళ్లలో ఐదుగురు నామినేషన్లలో ఉండగా కొత్త ఘట్టానికి నిన్న తెర లేచింది. ఆల్రెడీ సేఫ్ అయిన అఖిల్ తప్ప అందరూ ఇకపై ప్రేక్షకుల తీర్పుకు అనుగుణంగా హౌసులో ఉండటం, సెలవు తీసుకోవడం ఉంటుందని బిగ్ బాస్ తేల్చి చెప్పేశాడు. అంటే ఇక్కడిదాకా అంతా నేనే చేశాను ఇకనైనా ఆడియన్స్ కి ఛాయస్ ఇద్దామనే అర్థంలో కాబోలు. అరియనా తన స్ట్రగుల్ ని చెప్పుకుంది, నాలుగు వేల రూపాయలతో మొదలుపెట్టిన కెరీర్ నుంచి అసలు తనకు అర్హతే లేని బిగ్ బాస్ దాకా వచ్చి ఇంత పాపులారిటీ దక్కడం పట్ల తన ఎమోషన్ బయటపెట్టుకుంది. ఇందులో ఎలాంటి నాటకీయత కనిపించలేదు. నిజంగానే ఫీలయ్యింది.

ఇప్పుడిది చివరి అంకం కాబట్టి అందరినీ నామినేట్ చేస్తున్నానని చెప్పిన బిగ్ బాస్ టైటిల్ గెలవడమే టార్గెట్ గా పెట్టుకుని ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలో మీరే డిసైడ్ చేసుకోవాలని ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ప్రక్రియలో వచ్చే టాస్కులను బట్టి ఎవరు ఎక్కువగా ఆకట్టుకునేలా గేమ్ ఆడి మెప్పిస్తారో వాళ్ళను చూసేవాళ్ళే నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై చేస్తారని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అందరూ ఒకరిని మరొకరు గ్రీటింగ్స్ చెప్పుకుని సిద్ధమయ్యారు. దానికి తోడు షో టైమింగ్ మార్పు కూడా రేటింగ్స్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ఆట చాలా రసవత్తరంగా సాగాల్సిన అవసరం చాలా ఉంది.

ఇక రాజు రాజ్యం అనే టాస్కు నిన్న జరిగింది. బజర్ సౌండ్ వచ్చినప్పుడంతా ఒక్కొక్కరి తల మీద కిరీటం వస్తుంది. అప్పుడు హౌస్ మొత్తం వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. రూల్స్ కూడా వాళ్ళిష్టం. సొహైల్ రాజైనప్పుడు సరదాగానే సాగింది. హారిక మాత్రం యథావిధిగా అవసరానికి మించి ఓవర్ చేసింది. ఒకరకంగా మైనస్ మార్కులు వచ్చేలా ప్రవర్తించింది. ఇక్కడే అరియనా తన అడ్వాంటేజ్ ని తీసుకుని డీసెంట్ గా ఉంటూ పాజిటివ్ కార్నర్ దక్కేలా చేసుకుంది. అభిజిత్ రాజు టాస్కులో తేలిపోయాడు. మొత్తానికి ప్రేక్షకులకైతే వీళ్ళ భవిషత్తును వదిలేశారు కానీ నిజంగా బిగ్ బాస్ అన్నమాట మీద ఉంటాడా. చూద్దాం.