iDreamPost
android-app
ios-app

మసాలా కోటింగ్ ఇచ్చిన సభ్యులు – హాట్ గా ఉన్న టాస్కులు

  • Published Dec 12, 2020 | 4:54 AM Updated Updated Dec 12, 2020 | 4:54 AM
మసాలా కోటింగ్ ఇచ్చిన సభ్యులు – హాట్ గా ఉన్న టాస్కులు

బిగ్ బాస్ 4లో మరో వారాంతం వచ్చేసింది. తొంభై ఆరు రోజులుగా సాగుతున్న గేమ్ షో ఇంకో తొమ్మిది రోజుల్లో ముగియబోతోంది. గత మూడు సీజన్ల స్థాయిలో లేదనే కామెంట్స్ గట్టిగానే ఉన్నప్పటికీ సెలబ్రిటీలు కానీ పార్టిసిపెంట్స్ తో ఆటని ఏదోలా మేనేజ్ చేస్తూ వచ్చారు నిర్వాహకులు. ఇక నిన్నటి హై లైట్స్ సంగతేంటో చూద్దాం. అఖిల్ మరోసారి మన్మథ వేషం ఎత్తాడు. కిచెన్ లో ఉన్న హారికను వెనుక నుంచి వాటేసుకుని ఆమె జుత్తు వాసన చూసి ఇదేం షాంపూ అని కలరింగ్ ఇచ్చాడు. దానికి హారిక బదులు చెబుతూ బాత్ రూమ్ లో ఉంది కళ్ళెక్కడ పెట్టుకుని స్నానం చేస్తావో అంటూ ఓ డబుల్ మీనింగ్ సమాధానం చెప్పి కవ్వించింది.

ఈ సందర్భంగానే హారిక సోహైల్ అఖిల్ మధ్య హాట్ డిస్కషన్ జరిగింది. తిట్టుకోలేదు కానీ పరస్పరం ద్వందార్థాలతో కాసేపు చర్చించుకున్నారు. ఫ్యామిలి ఆడియన్స్ ఎక్కువగా చూసే అవకాశం లేదనే ధీమా కాబోలు ఒకరిని మించి మరొకరు సంభాషణలతో హోరెత్తించారు. ఇక రేస్ లో ఉన్న ఆరుగురు సభ్యులకు ఫోటో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సొహైల్, అఖిల్ లు జడ్జ్ గా వ్యవహరించగా అభిజిత్, హారిక, మోనాల్, అరియనాలు అందులో పాల్గొన్నారు. మోనాల్ చాలా క్రియేటివ్ గా తన టాలెంట్ చూపించడంతో న్యాయనిర్ణేతలతో విజేతగా ప్రకటించబడింది.

తర్వాత తక్కువ సైజు ఉన్న బూట్లతో డాన్స్ చేసే మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో కూడా ఓ మెలిక పెట్టాడు. ఈ సందర్భంగా సభ్యుల మధ్య కొన్ని ట్విస్టులు జరిగాయి. అయితే అరియనా, హారిక హీరోయిన్ల రేంజ్ లో పొట్టి బట్టలు వేసుకోవడం ఏంటో అర్థం కాలేదు. సినిమా తరహాలో మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు కాబోలు. ఇందులో మోనాల్ గోల్డెన్ మైక్ అందుకుంది. మరోసారి సొహైల్ అరియనా ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇవాళ నాగార్జున ఎంట్రీతో ఒకరు సేవ్ అయ్యే అవకాశం ఉంది. అది ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎలిమినేషన్ కు సంబంధించి కూడా ఇంకా లీకులు రాలేదు.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş