iDreamPost
android-app
ios-app

ప్రభాస్ పై అమితాబ్ ప్రశంసలు! డార్లింగ్ కి ఇంతకన్నా గొప్ప అవార్డు ఏముంటుంది!

  • Author ajaykrishna Published - 06:12 PM, Fri - 7 July 23
  • Author ajaykrishna Published - 06:12 PM, Fri - 7 July 23
ప్రభాస్ పై అమితాబ్ ప్రశంసలు! డార్లింగ్ కి ఇంతకన్నా గొప్ప అవార్డు ఏముంటుంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో ‘ప్రాజెక్ట్ K’ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ అశ్వినిదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ తో పాటు మైథాలజీ టచ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే.. ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ లో.. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే హీరోయిన్ కాగా.. లెజెండరీ యాక్టర్స్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విశ్వనటుడు కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2024లో ఈ సినిమా వరల్డ్ వైడ్ ఊహించని బిగ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది.

ఇలాంటి తరుణంలో అసలు ఈ సినిమా టైటిల్ ప్రాజెక్ట్ కే కాకుండా ఒరిజినల్ టైటిల్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. జులై 20న అమెరికాలోని సాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ కే టైటిల్, చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ ఎక్సయిట్ మెంట్ పీక్స్ కి చేరుకుంది. ఇప్పటిదాకా ఇండియా నుండి ఏ ఒక్క సినిమా సాన్ డియాగో కామిక్ కాన్ లో లాంచ్ అవ్వలేదు. ఇదే పెద్ద సర్ప్రైజ్ అనుకుంటే.. ఇందులో కీలకపాత్ర పోషించిన బిగ్ బి అమితాబ్.. ప్రాజెక్ట్ కే టీమ్ ని అభినందిస్తూ.. డార్లింగ్ ప్రభాస్ కి, అతని ఫ్యాన్స్ కి కడుపు నిండిపోయే రీతిలో ప్రశంసలు కురిపించారు.

ట్విట్టర్ వేదికగా అమితాబ్.. “తెలుగు సినిమా ప్రాజెక్ట్ కే మూవీలో నేను కూడా భాగం అయినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. అందులోనూ ప్రభాస్ లాంటి ఐడల్ తో ఒకే ఫ్రేమ్ షేర్ చేసుకోవడం ఇంకా గౌరవంగా ఉంది. అందరికీ థాంక్యూ. డైరెక్టర్ నాగి సార్ నన్ను ప్రాజెక్ట్ కేలో భాగం చేసినందుకు థాంక్యూ. అలాగే ప్రభాస్ నాపై చూపించిన రెస్పెక్ట్, అఫెక్షన్, ఆ కేరింగ్ కి నన్ను ఎమోషనల్ గా టచ్ చేశాయి. నాకు మాత్రమే కాదు.. ప్రభాస్ చూపించిన అఫెక్షన్ ప్రాజెక్ట్ కే టీమ్ అందరిని దగ్గర చేసింది. మీ అందరి హార్డ్ వర్క్.. ఈ సినిమాతో ప్రపంచపు ఎల్లలు దాటి విస్తరించాలని కోరుకుంటున్నాను.” అని ప్రశంసలు కురిపించారు. దీంతో అమితాబ్ ట్వీట్ చూసి ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ.. ప్రభాస్ కి ఇంతకన్నా గొప్ప అవార్డు ఏం దక్కుతుంది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అమితాబ్ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి అమితాబ్ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş