Dharani
Dharani
ప్రస్తుతం అన్నింటి ధరలు రాకెట్ కన్నా స్పీడ్‌గా దూసుకెళుతున్నాయి. రూపాయికి వచ్చే వస్తువే కనబడటం లేదు. కనీసం టీస్టాల్‌కి వెళ్లి చాయ్ తాగాలన్నా.. ఎంతలేదన్నా 10-20 రూపాయలే ఖర్చు అవుతాయి. ఇక పెట్రోల్, డీజిల్, బంగారం వంటి వాటి ధరల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది కేవలం 18 రూపాయలకే సైకిల్ వస్తుంది అంటే నమ్ముతారా.. ఏదైనా ఆఫర్ అనుకుని పరిగిత్తెకు వెళ్తారు కదా. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 18 రూపాయలకే సైకిల్ అనే వార్త.. సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కానీ ఒక్క నిమిషం ఆగండి.. అసలు 18 రూపాయిలకే సైకిల్ రావడం ఏంటి అంటే..
రూ.18 కే సైకిల్.. అంటే.. ఇది ఇప్పటి కాలం నాటి సైకిల్ కాదు.. ఇప్పటి బిల్ కాదు. ఇప్పటిది కాదు అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ వార్త చెబుతున్నారు అంటే.. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో సుమారు 90 ఏళ్ల క్రితం కొన్న సైకిల్ రిసెప్ట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే ఈ సైకిల్ కొన్నది 1934లో. అప్పుడు దీని ధర 18 రూపాయలు. ఇప్పుడు మనకు 18 రూపాయలు అంటే చాలా తక్కువ మొత్తం అని అనుకోవచ్చు. కానీ.. ఆ కాలానికి.. మాత్రం ఇది చాలా పెద్ద మొత్తమే. మరి ఈ సైకిల్ బిల్ ఎలా బయటకు వచ్చింది అంటే..
ఇప్పుడు అంటే అన్ని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నాం. కానీ ఒకప్పుడు ఏది కొన్నా.. తప్పకుండా బిల్ రశీదు జాగ్రత్తగా దాచి పెట్టేవారు. అవకాశం ఉంటే వారే జాగ్రత్తగా దాచి పెడతారు. కొత్తగా ఏవైనా కొన్నా.. ఇలానే బిల్ దాస్తారు. ఎందుకు అంటూ.. తాము కొన్న వస్తువులు ఎప్పుడైన పాడైతే బిల్లు ఉంటే.. ఆ గ్యారంటీతో రిపేర్లు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా భద్రంగా దాచిన బిల్లలు ఏదో ఒక సందర్భంలో బయటకు వచ్చి.. మనల్ని.. ఆ కాలానికి తీసుకువెళ్తాయి.
ఇక తాజాగా ఓ వ్యక్తి తన ఇంట్లో బీరువాలో ఏదో వెతుకున్నాడు. అతనలా వెతుకుతోంటే అతనికి ఓ కాగితం కనిపించింది. ఏదో బిల్ పేపర్‌లా ఉండటం.. బాగా పాతగా ఉండటంతో ఆ వ్యక్తి దాన్ని విప్పి చూశాడు. అలా చూసిన అతనికి పెద్ద షాక్ తగిలింది. సుమారు 90ఏళ్ళ క్రితం 18 రూపాయలతో సైకిల్ కొనుగోలుకు సంబంధించిన బిల్ పేపర్ అది. దాంతో ఆ వ్యక్తి తనకు దొరికిన బిల్ పేపర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ బిల్ పేపర్ తో పాటు, ఈ న్యూస్ కూడా వైరల్ గా మారింది.
1934వ సంవత్సరంలో కలకత్తాలో కుముద్ సైకిల్ వర్క్స్ పేరుతో ఉన్న షాప్‌లో ఈ సైకిల్ కొనుగోలు చేశారు. సైకిల్‌కి బెల్‌తోపాటు లైట్ కూడా ఇస్తున్నట్టు బిల్‌లో రాశారు. అంటే అప్పుడు సైకిల్‌కి రాత్రిపూట కూడా కనబడేలాగా ఇపుడు స్కూటర్, బైక్‌లకు ఉంటున్నట్టుగా లైట్ ఉండేది. అవి రెండు కలిపి సైకిల్‌ను రూ. 18కి అమ్మినట్టు రశీదు ఇచ్చారు. ఈ సైకిల్ విలువ అప్పటికి అక్షరాలా 18 రూపాయలు. కాలంతో పాటు సైకిల్ ధరలు కూడా పెరిగిపోయాయి.
ఈ క్రమంలో బయటపడిన ఈ సైకిల్ బిల్లు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. ఈ బిల్లుకు సంబంధించిన ఫోటోను పుష్పిత్ మహరోత్ర అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశాడు. 90ఏళ్ళ కిందటి సైకిల్ బిల్లు బీరువాలో దొరికింది. అప్పట్లో 18రూపాయలంటే ప్రస్తుతం 1800రూపాయలతో సమానం అనుకుంటున్నాను. నిజమేనా అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి నెటిజనుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది.