iDreamPost
android-app
ios-app

‘భీమ్లా నాయక్’ దర్శకుడితో బెల్లంకొండ!

  • Published Jan 25, 2023 | 10:32 PM Updated Updated Dec 21, 2023 | 6:36 PM

మలయాళ ఫిల్మ్ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ దర్శకుడిగా సాగర్‌ కె చంద్రకు రావాల్సినంత క్రెడిట్ దక్కలేదనేది నిజం. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పవన్ - త్రివిక్రమ్ సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ అయింది.

మలయాళ ఫిల్మ్ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ దర్శకుడిగా సాగర్‌ కె చంద్రకు రావాల్సినంత క్రెడిట్ దక్కలేదనేది నిజం. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పవన్ - త్రివిక్రమ్ సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ అయింది.

  • Published Jan 25, 2023 | 10:32 PMUpdated Dec 21, 2023 | 6:36 PM
‘భీమ్లా నాయక్’ దర్శకుడితో బెల్లంకొండ!

అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలతో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న సాగర్‌ కె చంద్ర మూడో సినిమాకే ఏకంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే భీమ్లా నాయక్‌. మలయాళ ఫిల్మ్ అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌ కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించినప్పటికీ దర్శకుడిగా సాగర్‌ కె చంద్రకు రావాల్సినంత క్రెడిట్ దక్కలేదనేది నిజం. ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించడంతో.. ఇది పవన్ – త్రివిక్రమ్ సినిమా అన్నట్లుగా ప్రొజెక్ట్ అయింది. దాంతో భీమ్లా నాయక్‌ సినిమా ఆకట్టుకున్నప్పటికీ సాగర్‌ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరలేదు. భారీ అవకాశాలూ క్యూ కట్టలేదు. ఆ సినిమా వచ్చి ఏడాది అయినా ఇంతవరకు సాగర్‌ కొత్త సినిమా ప్రకటన రాలేదు. అయితే ఎట్టకేలకు దర్శకుడిగా సాగర్ నాలుగో సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. తన తదుపరి చిత్రాన్ని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయబోతున్నట్లు సమాచారం.

‘అల్లుడు శీను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీనివాస్.. హీరోగా నిలదొక్కుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటిదాకా హీరోగా ఎనిమిది సినిమాలు చేయగా ఒకట్రెండు మినహా ఏవీ పెద్దగా ఆకట్టుకోలేదు. చివరిగా అతను నటించిన అల్లుడు అదుర్స్ సినిమా 2021లో విడుదలై నిరాశపరిచింది. ఆయన హీరోగా నటించిన సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. ప్రస్తుతం వీవీ వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నాడు.. కానీ దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే టైగర్ నాగేశ్వరారావు జీవిత కథ ఆధారంగా స్టువర్టుపురం దొంగ అనే చిత్రాన్ని ప్రకటించాడు. కానీ ఇప్పటికే రవితేజ పాన్ ఇండియా రేంజ్ లో టైగర్ నాగేశ్వరారావు టైటిల్ తో అదే కథతో సినిమా చేస్తున్నాడు. దీంతో బెల్లంకొండ నెక్స్ట్ తెలుగు మూవీపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఎట్టకేలకు ఆయన కొత్త సినిమాపై స్పష్టత వచ్చిందని, త్వరలోనే ప్రకటన కూడా రానుందని సమాచారం. ఈ సినిమా సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో 14రీల్స్ ప్లస్ బ్యానర్ లో రూపొందనుందని వినికిడి. మరి సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండకు ఈ చిత్రం విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss