iDreamPost
android-app
ios-app

రూము కోసం చూస్తుంటే.. పులిహోర రాజా తగిలాడు!

రూము కోసం చూస్తుంటే.. పులిహోర రాజా తగిలాడు!

సిలికాన్‌ సిటీ బెంగళూరులో ఇళ్లు అద్దెకు దొరకటం చాలా కష్టం. అది కూడా మంచి లొకాలటీలో ఇళ్లు దొరకటం అన్నది అదృష్టం ఉంటే కానీ, సాధ్యపడదు. ఒకవేళ దొరికినా కూడా.. అద్దెలు 20,30 వేల రూపాయల దాకా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఫ్రెండ్స్‌ కలిసి రూము తీసుకుంటూ ఉంటారు. అయితే, ఓ యువతికి ఈ విషయంలో వింత అనుభవం ఎదురైంది. ఓ గుర్తు తెలియని వ్యక్తి రూము పేరుతో ఆ యువతితో పులిహోర కలపటానికి చూశాడు. ఆ వివరాల్లోకి వెళితే.. ఆకాంక్ష అనే యువతి బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆకాంక్ష ఇన్‌స్టాగ్రామ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది.

ఆ చాటింగ్‌ ఇలా సాగింది..

గుర్తు తెలియని వ్యక్తి : గుడ్‌మార్నింగ్‌.. నేను కూడా మంచి ఏరియాలో.. బడ్జెట్‌కు తగ్గ ఇంటి కోసం చూస్తున్నాను. బెంగళూరులో ఇళ్లు దొరకటం చాలా కష్టంగా ఉంది. మీరు నాతో చెయ్యి కలపడానికి సిద్ధమేనా?
ఆకాంక్ష : లేదు. క్షమించండి. ఫ్లాట్‌మేట్లను చేసుకోవటంలో నాకు ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా మగాళ్లను..
గుర్తు తెలియని వ్యక్తి : సరే.. ఈ విషయం మిమ్మల్ని అడగటానికి ఇది సరైన వేదిక కాదు. మీరు సింగిల్‌ అయి ఉండి.. ఓకే అంటే.. ఇద్దరమూ జీవితాలను పంచుకుందామా? పరస్పర గౌరవంతో..

ఇలా ఇద్దరి చాటింగ్‌ సాగింది. అతడి పెళ్లి ప్రపోజల్‌కు ఆమె రిప్లై ఇవ్వలేదు. ఆ చాటింగ్‌ దృశ్యాలను స్క్రీన్‌ షాట్‌ తీసి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఇంటి కోసం చూస్తుంటే ఈ దారుణం జరిగింది అంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.