Idream media
Idream media
అంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ఈ రోజు తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన విషయం తెలిసిందే. జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలనే దాదాపు ప్రస్తావించిన బీసీజీ ఆయా అంశాలను విసృత్త స్థాయిలో వివరించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ప్రణాలికను రూపొందించింది.
13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించింది. ఆయా జిల్లాలు ఏఏ రంగాల్లో వెనుకబడ్డాయో గుర్తించి, ఆయా రంగాల్లో ఎలా అభివృద్ధి చేయాలో సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక కార్యదర్శి విజయ్‌కుమార్ బీసీజీ నివేదికలోని వివరాలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
13 జిల్లాలను ఆరు ప్రాంతాలుగా విభజించి బీసీజీ అధ్యయనం చేసింది. ఆయా ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేసింది. ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ), గోదావరి డెల్టా ( ఉభయగోదావరి జిల్లాలు), కృష్ణా డెల్టా (కృష్ణా, గూంటురు), దక్షిణాంధ్ర (ప్రకాశం, నెల్లూరు), తూర్పు రాయలసీమ ( చిత్తూరు, కడప), పశ్చిమ రాయలసీమ (కర్నూలు, అనంతపురం)గా 13 జిల్లాలను విభజించింది. ఆరు ప్రాంతాల్లో ఉన్న వనరులు, అభివృద్ధికి ఉన్న అడ్డంకులు, పరిష్కారాలను సూచించింది.
ఎక్కడ ఏమి అభివృద్ధి చేయొచ్చు..
– ఉత్తరాం్ర«ధను మెడికల హబ్. కాఫీ, జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి.
– గోదావరి జిల్లాల్లో గ్యాస్, ప్లాస్టిక్ రంగాల్లో పరిశ్రమలు. వాటర్ గ్రిడ్, రోడ్డు గ్రిడ్. పోలవరంలో టూరిజం, బ్యాక్ వాటర్ టూరిజం.
– కృష్ణా జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి. మచిలీపట్నం, మైపాడు బీచ్‌ల అభివృద్ధి.
– చిత్తూరు జిల్లాలో టమాటా పంటకు కోల్డ్ స్టోరేజీలు.
– తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటు
– కర్నూలు– అనంతపురంలో ఆటోమెబైల్, లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి.