iDreamPost
android-app
ios-app

KL రాహుల్ కెప్టెన్‌గా.. దక్షిణాఫ్రికాతో T20 సిరీస్‌‌కు జట్టు ఎంపిక చేసిన BCCI ..

  • Published May 22, 2022 | 6:45 PM Updated Updated May 22, 2022 | 6:45 PM
KL రాహుల్ కెప్టెన్‌గా.. దక్షిణాఫ్రికాతో T20 సిరీస్‌‌కు జట్టు ఎంపిక చేసిన BCCI ..

ఒక పక్క IPL జరుగుతూ ఉంది. IPLలో బాగా ఆడి ఇండియా జట్టులో చోటు సంపాదించాలని చాలా మంది యువ క్రికెటర్లు ఆశిస్తారు. IPL తర్వాత భారత జట్టు దక్షిణాఫ్రికాతో అయిదు T20 మ్యాచ్ లతో కూడిన సిరీస్ ఆడనుంది. జూన్ లో మొదలవనున్న దక్షిణాఫ్రికా T20 సిరీస్ కి BCCI జట్టుని ప్రకటించింది.

దక్షిణాఫ్రికాతో జరగనున్న T20 సిరీస్‌ కు రోహిత్ రెస్ట్ తీసుకోవడంతో అంతా శిఖర్ ధావన్ ని కెప్టెన్ గా ఎంపిక చేస్తారు అనుకున్నారు. కానీ BCCI శిఖర్ ధావన్ ని పక్కన పెట్టేసి కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్‌లో అదరగొడుతున్న దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్యలకు తిరిగి జట్టులోకి స్థానం ఇచ్చారు. అలాగే IPL లో రాణిస్తున్న దినేశ్ కార్తీక్‌కు చోటు దక్కింది.

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ చేతన్ శర్మ నేతృత్వంలో ఆదివారం ముంబయిలో సెలక్షన్‌ కమిటీ సమావేశమై ఈ జట్టుని ఎంపిక చేసింది. ప్రస్తుతం KL రాహుల్‌ IPLలో కెప్టెన్ గా లక్నో సూపర్‌ జెయింట్స్‌ టీంని అద్భుతంగా నడిపిస్తుండటంతో అతనికి కెప్టెన్సీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దక్షిణాఫ్రికా టీమ్‌ఇండియాతో ఐదు T20లు ఆడనుంది. జూన్‌ 9న ఢిల్లీ, 12న కటక్‌, 14న వైజాగ్‌, 17న రాజ్‌కోట్‌, 19న బెంగళూరులో ఈ మ్యాచులు జరగనున్నాయి.

ఎంపిక చేసిన T20 జట్టు: KL రాహుల్‌(కెప్టెన్), రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ పంత్‌(వైస్ కెప్టెన్), దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌