iDreamPost
iDreamPost
భారత దేశ వ్యాప్తంగా మూడు రోజులపాటు బ్యాంకులు పనిచేయవు. బ్యాంకులకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీలను, ఈరోజే పూర్తిచేసుకోవాలని బ్యాంక్ వర్గాలు సలహానిస్తున్నాయి. లేకపోతే మూడు రోజుల వరకు వెయిట్ చేయాలి. మే నెలలో, మొత్తం బ్యాంకులకు 11 రోజులపాటు సెలవులు ఉన్నాయని తెలిసిందే. ఇప్పటికే సగం నెల పూర్తి కావస్తోంది. మే 13వ తేదీ శుక్రవారం బ్యాంకులు పనిచేస్తాయి. మే 14వ తేదీ శనివారం. సెకండ్ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు. ఇక మే15వ తేదీ ఆదివారం. ఎలాగూ సెలవు. మరుసటి రోజు అంటే మే 16వ తేదీ సోమవారం బుద్ధ పూర్ణిమ. ఈ రోజున బ్యాంకులు పని చేయవు. దీంతో మే 13వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు దేశంలోని చాలా చోట్ల బ్యాంకులు తెరచుకోవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవులు ఉండకపోవచ్చు. రాష్ట్రాలను బట్టి ఉంటాయి. బుద్ధ పూర్ణిమ రోజున తెలంగాణ, ఏపీలలో బ్యాంకులు పనిచేస్తాయి. మహరాష్ట్ర, న్యూఢిల్లీ, చత్తీస్‌గడ్, ఝార్ఖాండ్, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్, మధ్య ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖాండ్, జమ్మూ, ఉత్తర ప్రదేశ్, త్రిపుర, బెల్లాపూర్ లలో మాత్రమే బ్యాంకులు మూతపడతాయి. ముందుగానే జాగ్రత్త పడడం మంచిది.