Dharani
Dharani
ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పార్టీలోని అతంర్గత కలహాలు బయటపడ్డాయి. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. బండి సంజయ్ మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగానే.. బీజేపీ అధిష్టానం.. బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తూ మంగళవారం (జూలై 4) సాయంత్ర ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా నియమించింది. ఈటల రాజేందర్‌ను ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా నియమించింది.
అయితే, బండి సంజయ్‌ని తొలగిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బండి సంజయ్‌కు మద్దతుగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. బండి సంజయ్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడంపై ఓ బీజేపీ నేత నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ వివరాలు..
బండి సంజయ్ కుమార్‌ను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవీ బాధ్యతల నుంచి తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తన నిరసన తెలుపుతూ.. బీజేపీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటన రావడంతో మనస్తాపానికి గురై ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్.. మంగళవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే శ్రీనివాస్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం ఆస్పత్రితో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు శ్రీనివాస్.. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు వివరిస్తూ.. సూసైడ్ లెటర్‌ను రాసిపెట్టారు.
‘బండి సంజయ్ అన్నా.. ఇక సెలవు’ అంటూ గజ్జెల శ్రీనివాస్ సూసైడ్ లెటర్ రాశారు. ‘బండి సంజయ్ అన్నను రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తొలగించడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అధిష్టానం తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. అలా అని నాకు ఎవరి మీద కోపం లేదు. కేవలం బండి సంజయ్ అన్న మీద నేను పెంచుకున్న ప్రేమ కారణంగానే.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’’ అని గజ్జెల శ్రీనివాస్ సూసైడ్ నోట్‌లో రాసుకొచ్చాడు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయణ్ని ఖమ్మం పట్టణంలోని రక్షా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారు తెలిపారు కుటుంబ సభ్యులు. ఇక అధిష్టానం నిర్ణయంపై బీజేపీ మహిళా నేత విజయశాంతి కూడా అగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ మార్పు బాధకరం అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.