Uppula Naresh
Uppula Naresh
వినాయక చవితి ఉత్సవాలు అంటే అందరికీ గుర్తొచ్చేది మాత్రం ఖైరతాబాద్ బడా గణేశుడు. ఇక లడ్డూ విషయానికి వస్తే.. బాలాపూర్ లడ్డూ గుర్తుకు వస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ మహా ప్రసాదాన్ని దక్కించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ఔత్సాహికులు పోటీ పడుతుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొని ఏకంగా రూ.27 లక్షలకు దక్కించుకున్నారు. ఈ ఏడాది లడ్డు వేలంలో దాదాపు 36 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు.
ఇక గతేడాది మాత్రం బాలాపూర్ లడ్డును వంగేటి లక్ష్మారెడ్డి రూ.24 లక్షల 60 వేలకు ఈ లడ్డును దక్కించుకున్నారు. ఇకపోతే, బాలాపూర్ లడ్డుకు దాదసే 30 ఏళ్ల చరిత్ర ఉంది. 1994 నుంచి ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది అంతకంతకు పెరుగుతూ రికార్డ్ స్థాయిలో ధర పలుకుతూ వస్తుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. అదేంటంటే? బాలాపూర్ లడ్డూ చరిత్రలో ఇదే ప్రాంతానికి చెందిన కొలన్ కుటుంబ సభ్యులు 1994 నుంచి మొదలుకుని 2019 వరకు చాలా సార్లు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులే వేలంలో పాల్గొని ఈ లడ్డును దక్కించుకున్నారు. ఇంతకు కొలన్ కుటుంబ సభ్యులు బాలాపూర్ లడ్డూను ఎన్ని సార్లు దక్కించుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బాలాపూర్ లడ్డు చరిత్ర:
దాదాపు 30 ఏళ్ల చరిత్ర కలిగిన బాలాపూర్ లడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు దక్కించుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం.