iDreamPost
iDreamPost
మొట్టమొదటిసారి బాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ చిన్నితెరపై ఎలా కనిపించబోతున్నారన్న ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ పెరిగిపోతోంది. నవంబర్ 4న ఆహా యాప్ లో తొలి ఎపిసోడ్ ప్రీమియర్ కాబోతోంది. మొదటి భాగంలో మంచు ఫ్యామిలీ రానుందని ఇన్ సైడ్ టాక్. మోహన్ బాబు తో పాటు లక్ష్మి, విష్ణులు కూడా ఇందులో భాగం పంచుకుంటారని తెలిసింది. నిన్న సోషల్ మీడియాలో బయటికి వచ్చిన ఫోటోని బట్టి చూస్తే అదే అర్థమవుతుంది. తర్వాత సీక్వెన్స్ లో మెగా బ్రదర్ నాగబాబు వస్తారని మరో న్యూస్ ప్రచారంలో ఉంది. గతంలో బాలయ్య అంటే ఎవరూ అని కామెడీ చేసిన ఈయన రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
నిజానికి ఈ షో లిస్టులో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని గతంలో ప్రచారం జరిగింది. అదే జరిగితే ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునే అరుదైన మూమెంట్స్ ని చూడొచ్చని కూడా అందరూ అనుకున్నారు. ఇంకొద్ది రోజులు ఆగితే దీనికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. చేతికి సర్జరీ చేయించుకున్న చిరు వస్తారో రారో చెప్పలేం. బయటి కార్యక్రమాలకు అలాగే కట్టుతో హాజరవడం చూస్తూనే ఉన్నాం. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తనతో పాటు పైసా వసూల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కంపెనీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఆయా ఆర్టిస్టులు దర్శకుల కాల్ షీట్లను బట్టి ఉంటుంది.
ఈ టాక్ షోకు గాను బాలయ్య ఎపిసోడ్ కు 40 లక్షల చొప్పున మొత్తం 12 ఎపిసోడ్లకు కలిపి 4.8 కోట్లు తీసుకోవచ్చని అంతర్గతంగా తెలుస్తున్న సమాచారం. దీన్ని ఛారిటీకే వినియోగిస్తారని తెలిసింది. సీజన్ 1 కు వచ్చే రెస్పాన్స్ ని బట్టి దీన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ఆలోచనలో ఆహా ఉంది. ఇదే ప్లాట్ ఫార్మ్ లో గతం సమంతా చేసిన ప్రోగ్రాం ఆశించిన స్పందన దక్కించుకోలేదు. ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన నందినిరెడ్డి స్థానంలో ఇప్పుడు బాలకృష్ణ కోసం ప్రశాంత్ వర్మ వచ్చాడు. ఇప్పుడీ హంగామా దెబ్బకు అఖండ రిలీజ్ డేట్ ఎప్పుడనే చర్చ పక్కకు వెళ్లిపోయింది. నవంబర్ 4 స్టాప్ చేయలేని హీరో విశ్వరూపం కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ALSO READ – YS Jagan – Chandrababu Delhi Tour : జగన్ ఆ విషయాన్ని వదిలేశారు..! బాబులో తారాస్థాయికి ఫ్రస్ట్రేషన్