iDreamPost
android-app
ios-app

బోయపాటి కోసం బాలయ్య త్యాగం

  • Published Jan 20, 2020 | 4:39 AM Updated Updated Jan 20, 2020 | 4:39 AM
  • Published Jan 20, 2020 | 4:39 AMUpdated Jan 20, 2020 | 4:39 AM
బోయపాటి కోసం బాలయ్య త్యాగం

నిన్న పార్టీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ విగ్గు లేకుండా గుండుతో కనిపించడం అభిమానులను షాక్ కి గురి చేసింది. వంద సినిమాల కెరీర్ లో ఎన్నడూ బాలయ్య ఇలా జుత్తు తీసే సాహసం చేయలేదు. ఎన్టీఆర్ మహానాయకుడులో కథ డిమాండ్ చేసినా అక్కడ మేకప్ తో మేనేజ్ చేశారు కాని నిజంగా గుండు చేయించుకోలేదు. ఇప్పుడు ఇంత రిస్క్ చేశారు అంటే ఖచ్చితంగా అది బోయపాటి శీను దర్శకత్వంలో రూపొందబోయే సినిమా కోసమే అని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

అయితే సినిమాలో కూడా ఇలాగే కనిపిస్తారా లేదా ఏదైనా ప్రత్యేకమైన విగ్గు కోసం ఇలా షేవ్ చేయించుకున్నారా అనేది క్లారిటీ లేదు. కానీ బారుడు మీసంతో జుట్టు లేకుండా బాలయ్య బాగున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవలే విడుదలైన రూలర్ రిజల్ట్ విషయం పక్కన పెడితే అందులో హీరో మేకప్ గురించి చాలా తీవ్రమైన కామెంట్స్ వచ్చాయి. చాలా దారుణంగా బాలయ్య లుక్ ని డిజైన్ చేశారని ఫ్యాన్స్ సైతం విమర్శించారు.

అందుకే పూర్తి మేకోవర్ తో బోయపాటి సినిమా కోసం రెడీ అవుతున్నట్టు దీన్ని బట్టి అర్థమవుతోంది. బాలకృష్ణకు ఇప్పుడు హిట్ దక్కడం చాలా అవసరం. గత ఏడాది ఏకంగా మూడు డిజాస్టర్లు వచ్చి పడ్డాయి. బయ్యర్లు నష్టాలపాలయ్యారు. ఇమేజ్ తో పాటు మార్కెట్ కూడా బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో సాలిడ్ గా హిట్ కొట్టాల్సిన లక్ష్యంతో కథను ఎంచుకున్నారట. అందుకే కొంత టైం తీసుకుంటున్నా బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ఇంకా వెళ్ళలేదు. సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet