iDreamPost
android-app
ios-app

సలార్, ప్రాజెక్ట్ K హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో ప్ర‌భాస్, రాధే శ్యామ్ రిజ‌ల్ట్ వెంటాడుతోందా?

  • Published Jul 09, 2022 | 7:52 PM Updated Updated Jul 09, 2022 | 7:52 PM
  • Published Jul 09, 2022 | 7:52 PMUpdated Jul 09, 2022 | 7:52 PM
సలార్, ప్రాజెక్ట్ K  హై-ఆక్టేన్ యాక్షన్ సీన్స్ లో ప్ర‌భాస్, రాధే శ్యామ్ రిజ‌ల్ట్ వెంటాడుతోందా?

రాధే శ్యామ్ ఫ్లాప్ త‌ర్వాత, ప్రభాస్ కాన్ఫిడెన్స్ బాగా దెబ్బ‌తిన్న‌ట్లు క‌నిపిస్తోంది. అందుకే మొత్తం టైం అంతా సాలార్, ప్రాజెక్ట్ కె కోసం కేటాయించాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డానికి, త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీలో ప్ర‌భాస్ క్రేజ్, రెమ్యునిరేష‌న్ రెండూ ఎక్కువే. రాబోయే సినిమాలపై ఇప్ప‌టికే 350-400 కోట్లు వ‌ర‌కు రెమ్యునిరేష‌న్ ప్ర‌భాస్ రానుంది. వ‌రుస‌గా, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ K , సందీప్ వంగ స్పిరిట్ ఉన్నాయి. షూటింగ్ మ‌ధ్య‌లో కాస్తంత విరామంతో ప‌నిచేసే తత్త్వం తెలుగు సినిమా స్టార్ల‌ది. ప్ర‌భాస్ కూడా అంతే. కాని ఇప్పుడు చాలా యాక్టీవ్ గా, మంచి ఫిజిక్ తో పాన్ ఇండియ‌న్ హీరో వ‌ర్క్ చేస్తున్నారు. కార‌ణం, రాధేశ్యామ్ ఫ్లాప్.

ప్రభాస్ ఇటీవల రెండు హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ఒకటి స‌లార్, రెండోది ప్రాజెక్ట్ K కోసం బ్యాక్-టు-బ్యాక్ వ‌ర్క్ చేశాడు. అల‌స‌టే అన్న‌దే లేకుండా, క్వాలిటీ కోసం ఎన్ని టేకుల‌కైనా రెడీ అంటున్నాడు. అందుకే రెండు మూవీ టీంలు చాలా హ్యాపీ.

స‌లార్ త‌ర్వాత ప్రాజెక్ట్ కె బ్యాక్ టు బ్యాక్ వ‌చ్చేలా ప్ర‌భాస్ ప్లాన్ చేసుకొంటున్నాడు. అందుకే ఇంటెన్సీటి త‌గ్గ‌కుండా, రెండు ప్రాజెక్ట్ ల మీద, ప్ర‌భాస్ వ‌ర్క్ చేస్తున్నాడు. ఈసారి రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఇవ్వాల‌న్న క‌సి ప్ర‌భాస్ లో క‌నిపిస్తోంది. అందుకే షాట్ ఒకే అన్నా, రెండుమూడుసార్లు చూసుకొని, సంతృప్తి చెందిన త‌ర్వాతే సెట్ ను వ‌దిలిపెడుతున్నాడు.

ఆదిపురుష్ క‌న్నా స‌లార్, ప్రాజెక్ట కె మీద‌నే ప్ర‌భాస్ కు గ‌ట్టి న‌మ్మ‌కముంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetCasibomgrandpashabetJojobet Girişbigbossgrandpashabet