Krishna Kowshik
తెలంగాణలో ఎన్నికల జోరు మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కాకుండానే ప్రచారాలు మొదలు పెట్టాయి ఆయా పార్టీలు. ఇదే సమయంలో సీటు దక్కని నేతలు అలక పాన్పులు, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సీటు రాకుండా పార్టీ నుండి బయటకు వచ్చేసేందుకు సిద్ధమవుతున్నారు.. వచ్చేస్తున్నారు. తాజాగా బీజెపీ నేత బాబు మోహన్ కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎన్నికల జోరు మొదలైంది. నోటిఫికేషన్ విడుదల కాకుండానే ప్రచారాలు మొదలు పెట్టాయి ఆయా పార్టీలు. ఇదే సమయంలో సీటు దక్కని నేతలు అలక పాన్పులు, అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. సీటు రాకుండా పార్టీ నుండి బయటకు వచ్చేసేందుకు సిద్ధమవుతున్నారు.. వచ్చేస్తున్నారు. తాజాగా బీజెపీ నేత బాబు మోహన్ కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
Krishna Kowshik
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యింది. నవంబర్ 30న ఎన్నికలు జరుగుతుండగా.. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు గెలుపు గుర్రాలను సిద్ధం చేసుకున్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మ్యానిఫెస్టోను విడుదల చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసింది. బీజెపీ కూడా తాజాగా రెండో జాబితాను విడుదల చేసింది. అయితే ఇప్పుడు అసమ్మతి రాజుకుంటుంది. తమకు ఆ స్థానం నుండి టికెట్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న నేతలకు.. పార్టీ మొండి చేయి చూపించడంతో అసంతృప్తి చెందుతున్నారు. వెంటనే ఆ పార్టీకి రాం రాం పాడేసి.. మరో పార్టీలో చేరిపోతున్నారు.
మాజీ మంత్రి, బీజెపీ నేత, సినీ నటుడు బాబు మెహన్ కూడా పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆందోల్ నియోజకవర్గం నుండి బాబు మోహన్, ఆయన కుమారుడు పోటీ చేస్తున్నారన్న వార్తలపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. అదేవిధంగా రాష్ట్ర బీజెపీ పెద్దలపై కూడా విరుచుకుపడ్డారు. బీజెపీ కొత్త, పాత అధ్యక్షులు ఇద్దరికీ ఎన్నో ఫోన్లు చేశానని, వారిద్దరూ ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని అన్నారు. ‘ఇది పెద్ద విచిత్రం. నాకు సీటు ఇవ్వమని అడుక్కుంటానా..పనికొస్తే ఇస్తారు. గెలిచే క్యాండిడేట్లకు ఇస్తారు. నేను లేననుకుంటా.. నాకెవ్వరూ ఓటు వెయ్యరనుకుంటా. నేను సగం మైండ్ ఉన్నవాడిని కదా.. నా ఓటు కూడా పక్కవాడికి వేస్తాను’ అని అనుకుంటాన్నారా అంటూ వ్యగ్యంగా ప్రశ్నించారు.
ఫస్ట్ లిస్ట్ లో తన పేరు లేదని చెప్పారు. ఎందుకు లేదో తెలియదని, ఆ దాపరికాలు ఎందుకో అంటూ ప్రశ్నించారు. బీజెపీ పెద్దలు మీకు విన్నవించేది ఒక్కటే..ఈ సారి నేను పోటీ చేయదల్చుకోలేదని అన్నారు. మీ టికెట్ వద్దు. అర్హులైన వారికి టికెట్ ఇవ్వండని చెప్పారు. పోటీ చేయనని, పార్టీకి దూరంగా ఉంటానని, ప్రచారం కూడా చేయనని చెప్పారు. పార్టీ పెద్దలు స్పందించే దాన్ని బట్టి బీజెపీలో కొనసాగాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని అన్నారు. ఆ రోజు మరిన్ని విషయాలు, అవమానాలు గురించి చెబుతానని అన్నారు. తన గురించి రాయోద్దని, తన పేరు కూడా వాడుతూ.. తలంపులు తేవద్దని మీడియాకు విన్నవించారు. తండ్రి, కొడుకుల మధ్య గొడవలు పెడతారా అని ప్రశ్నించారు. తన కొడుక్కి సీటు ఇస్తే సంతోషమేనని అన్నారు.