SNP
SNP
విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్‌లో సచిన్ తర్వాత సచిన్ అంతటోడు. ఇప్పుడే టీమ్‌లోకి వచ్చిన కొత్త కుర్రాడిలా ఎంతో ఉత్సాహంగా ఉండే.. ప్రపంచ క్రికెట్‌లో అతనో లెజెండ్. అలాంటి ఆటగాడిని అభిమానించని వారు, అతని ఆటకు ఫిదా కానీ వారంటూ ఉండరు. ఈవెన్.. పాకిస్థాన్‌లో కూడా కోహ్లీ వీరాభిమానులు ఉన్నారు. ఇండియా-పాకిస్థాన్ తలపడిన సమయంలో కూడా కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకునే పాకిస్థాన్ అభిమానులు చాలా మంది ఉన్నారు. అది కోహ్లీకి పాక్‌లో ఉన్న క్రేజ్. కానీ, ఒక్క విషయంలోనే పాక్ ఫ్యాన్స్ కోహ్లీని తక్కువ చేస్తుంటారు. అదే.. బాబర్ అజమ్‌ను కోహ్లీతో పోల్చడం.
కోహ్లీ కింగ్ కాదని, బాబర్ అజమ్ అసలైన కింగ్ అంటూ కొంతమంది పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రచ్చ రచ్చ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు వారిలో కూడా మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. తాజాగా.. కోహ్లీకి క్షమాపణలు చెబుతూ కొంతమంది పాకిస్థాన్, బాబర్ అజమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు. ఇన్ని రోజులు.. ఓ గొప్ప క్రికెటర్‌ను బాబర్ అజమ్‌తో పోల్చుతూ.. అవమానించాం అంటూ సారీ చెబుతున్నారు. ఇంతకీ పాక్ ఫ్యాన్స్‌లో ఈ మార్పుకు కారణం ఏంటంటే? అందుకు కూడా ఒక బలమైన రీజన్ ఉంది. అదేంటంటే..
ఆసియా కప్ 2023లో తొలి మ్యాచ్‌లోనే పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ 150కిపైగా పరుగులతో చెలరేగి ఆడాడు. నేపాల్ లాంటి పసికూనపై బాబర్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, ఆ తర్వాత వరుసగా విఫలం అవుతూ వచ్చాడు. ముఖ్యంగా కీలకమైన నాకౌట్ లాంటి మ్యాచ్‌ల్లో బాబర్ ఏనాడు రాణించలేదు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనే బాబర్ దారుణంగా విఫలం అయ్యాడు. ఇలా కీలక మ్యాచ్‌ల్లో విఫలం అవుతూ.. ఒత్తిడికి తట్టుకోలేని ఆటగాడిగా మారిపోతున్నాడు. కానీ, కోహ్లీ మాత్రం ఎంత ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఇంప్యాక్ట్ చూపిస్తాడు. అంత గొప్ప ఆటగాడిని బాబర్‌తో పోల్చడం తమ తప్పే అంటూ పాక్ అభిమానులు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. మరి పాక్ అభిమానుల్లో వస్తున్న ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Babar azam vs Nepal = 151(131)
Babar azam vs Ind + SL+ Ban = 56(81)
Minnow basher for a reason 🔔 pic.twitter.com/Vhz6kB76US
— Arun Singh (@ArunTuThikHoGya) September 14, 2023
ఇదీ చదవండి: ఆసియా కప్: టీమిండియాతో ఫైనల్! శ్రీలంకకు భారీ షాక్