ప్రస్తుత కాలంలో మహిళలకు సురక్షితమైన ప్లేస్ అంటూ ఈ భూమ్మిద ఏదీ లేదు అంటే అతిశయోక్తికాదేమో. దీనికి నిదర్శనం ప్రస్తుతం స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాలే. గుడి, బడి, ఇల్లు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మహిళలపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సాక్ష్యాత్తు పార్లమెంట్ లోనే తాను లైంగిక దాడికి గురయ్యాను అంటూ సంచలన ఆరోపణలు చేసింది ఓ మహిళా ఎంపీ. ప్రజాస్వామ్యానికి దేవాలయం పార్లమెంట్. అలాంటి పార్లమెంట్ లోనే తోటి సభ్యుడు తనను లైంగికంగా వేధించాడు అని వాపోయింది ఆ మహిళా ప్రతినిధి.
ప్రజాస్వామ్యానికి దేవాలయం దేశ పార్లమెంట్. అలాంటి పార్లమెంట్ లోనే ఓ మహిళా MP లైంగిక దాడికి గురైన సంఘటన సంచలనం రేపుతోంది. ఈ సంఘటన ఆస్ట్రేలియా పార్లమెంట్ లో చోటుచేసుకుంది. తనపై తోటి సభ్యుడు పార్లమెంట్ లోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ మహిళా ఎంపీ సంచలన ఆరోపణలు చేసింది. సెనేట్ లో ఆ ఎంపీ ఈ విధంగా ప్రసంగించింది..”పార్లమెంట్ లో నన్ను డేవిడ్ వాన్ అనుసరించే వాడు. సెక్స్ కోసం నన్ను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఇక నేను ఆఫీస్ గదిలోంచి బయటకు రావాలంటేనే భయపడిపోయేదాన్ని. పార్లమెంట్ ప్రాంగణంలో ఒక్కదాన్నే నడవాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉంటేనే వెళ్లేదాన్ని. అదీకాక నాలాగే ఇక్కడ చాలా మంది వేధింపులకు గురౌతున్నారు. వారి కెరీర్ లు నాశనం అవుతాయని వారు బయటకు రావట్లేదు” అంటూ కన్నీరు కార్చారు.
అయితే ఈ ఆరోపణలను డేవిడ్ వాన్ ఖండిచారు. సదరు మహిళా ఎంపీ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలే అని కొట్టిపారేశారు. ఈ విషయంపై తాను న్యాయపరంగా ముందుకు వెళ్తానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. డేవిడ్ వాన్ పై చేసిన ఆరోపణలను తాను వెనక్కుతీసుకుంటున్నట్లు సదరు మహిళా ఎంపీ పేర్కొంది. దాంతో అతడిపై చర్యలను నిలిపివేశారు.