Keerthi
ఇప్పటికే శబరిమలలో రోజురోజుకి అయ్యప్ప భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. ఆ మణికంఠ స్వామి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో గంటలతరబడి లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శబరిమలలో ఓ భక్తుడి పై పోలీసు ప్రవర్తించే తీరు దారుణంగా ఉంది. ఇంతకి ఏం జరిగిదంటే..
ఇప్పటికే శబరిమలలో రోజురోజుకి అయ్యప్ప భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. ఆ మణికంఠ స్వామి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో గంటలతరబడి లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శబరిమలలో ఓ భక్తుడి పై పోలీసు ప్రవర్తించే తీరు దారుణంగా ఉంది. ఇంతకి ఏం జరిగిదంటే..
Keerthi
కేరళ రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల. ఇక్కడే అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడికి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ప్రతి ఏటా శబరిమలకు వెళ్తుంటారు. దీంతో శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకి భారీగా పెరుగుతోంది. ఆ మణికంఠ స్వామి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. దీంతో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర వరకు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో శబరి గిరులు కిక్కిరిసిపోతున్నాయి. ఇంచుమించు 16 గంటలకు పైగా స్వామి దర్శనంకు సమయం పడుతోందని భక్తులు వాపోతున్నారు. కొండకు వెళ్లే అయ్యప్ప భక్తులు కనీస మౌళిక సదుపాయలు కూడా లేవని మండిపడుతున్నారు. మరోవైపు శబరిమలలో భక్తుల భారీగా పెరగడంతో పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శబరిమలలో ఓ భక్తుడి పై పోలీసులు అతి దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇప్పటికే శబరిమల అయ్యప్ప భక్తులతో ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉంది. దీంతో గంటలతరబడి లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పాడిందని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మండల దీక్ష తీసుకున్న భక్తులు శాస్తా దర్శనం కోసం ‘పతినెట్టంపాడి’ (18 మెట్లు) ఎక్కాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక భక్తుడు ఆలయం వద్ద 18 మెట్లు ఎక్కుతుండగా.. ఓ పోలీసు తనని కొట్టాడని ఫిర్యాదు చేశాడు. అసలు ఏం జరిగిదంటే.. బెంగుళూరుకి చెందిన ఎస్ రాజేష్(30) అనే భక్తుడు తమ 22 మంది సభ్యుల బృందంతో కలిసి శబరిమల అయ్యప్ప సన్నిధానంకు చేరుకున్నాడు.
కాగా, ఆదివారం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల మధ్య మరో జట్టు సభ్యుడు ఆరేళ్ల కొడుకుతో శాస్తా దర్శనం కోసం నెమ్మదిగా మెట్లుకెత్తునమని.. అది చూసిన ఓ పోలీసు అధికారి తనను నాలుగో మెట్టుకి రాగానే వీపుపై చేతితో కొట్టాడని రాజేష్ వెల్లడించాడు. అప్పుడు తాను నొప్పితో కేకలు వేస్తూనే పిల్లవాడిని పట్టుకొని వేగంగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తూండగా.. మళ్లీ ఆ పోలీసు ఆగకుండా మరో నాలుగు సార్లు వీపు మీద కొట్టినట్లు రాజేష్ తెలిపాడు. అలాగే తన వీపుపై పోలీసు గోళ్ల గుర్తులు కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రస్తుతం రాజేష్ ను శబరిమల సన్నిధానం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఇక ఈ ఘటన పై ట్రావెన్‌కోర్ దేవస్వోమ్ బోర్డు (టిడిబి) సభ్యుడు ఎ అజికుమార్ వెంటనే స్పందించారు. అలాగే సన్నిధానంలో పోలీసు స్పెషల్ ఆఫీసర్ ఆర్ ఆనంద్‌ను వ్యక్తిగతంగా కలిసి.. సదరు పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ వివాదం పై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విచారణ జరుపుతారని స్పెషల్ ఆఫీసర్ టీడీబీ సభ్యుడికి తెలిపారు. కాగా, ఈ ఘటన గురించి దేవస్వామ్ మంత్రి కె. రాధాకృష్ణన్ కూడా తెలుసుకుని శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) సూరజ్ షాజీని కలిసి వివరాలు కోరారు. శబరిమల యాత్రికుడు ఫిర్యాదు చేసినట్లు ఏడీఎం మంత్రికి తెలిపారు. మరి, శబరిమల భక్తుడిపై ఓ పోలీసు దాడి చేసిన తీరు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.