iDreamPost

బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్.. ఇంక అలా చేస్తే ఛార్జీల మోతే!

  • Published Jun 13, 2024 | 4:37 PMUpdated Jun 13, 2024 | 9:23 PM

దేశంలో డిజిటల్ పేమెంట్స్ హవా కొనసాగుతున్నప్పటికి.. ఈ ఏటీఎం సేవల వినియోగం అనేది ఏమాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఏటీఎం సేవలను ఉపాయోగించే బ్యాంకు కస్టమర్లకు మాత్రం ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇక మీదట ఏటీఎం సెంటర్లలో ఈ పని చేస్తే భారీ ఛార్జీలు వర్తిస్తాయి. అయితే సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రం ఈ ఆరు నగరాల్లో ఎటువంటి ఛార్జీలు కూడా వర్తించవు.

దేశంలో డిజిటల్ పేమెంట్స్ హవా కొనసాగుతున్నప్పటికి.. ఈ ఏటీఎం సేవల వినియోగం అనేది ఏమాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఏటీఎం సేవలను ఉపాయోగించే బ్యాంకు కస్టమర్లకు మాత్రం ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇక మీదట ఏటీఎం సెంటర్లలో ఈ పని చేస్తే భారీ ఛార్జీలు వర్తిస్తాయి. అయితే సేవింగ్స్ ఖాతాదారులకు మాత్రం ఈ ఆరు నగరాల్లో ఎటువంటి ఛార్జీలు కూడా వర్తించవు.

  • Published Jun 13, 2024 | 4:37 PMUpdated Jun 13, 2024 | 9:23 PM
బ్యాంకు కస్టమర్లకు బిగ్ షాక్.. ఇంక అలా చేస్తే ఛార్జీల మోతే!

ప్రస్తుతం దేశంలో డిజిటల్ పేమెంట్స్ హవా కొనసాగుతున్నా.. మరొపక్క  ఏటీఎం సర్వీసుల వినియోగం అనేది ఏమాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. మఖ్యంగా.. దేశంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రజలు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. ముఖ్యంగా ఎప్పుడంటే అప్పుడు సమయం, నియమం లేకుండా.. ఈ ATM సెంటర్లలో నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం ఏర్పాడింది. అయితే ఇలా ఎప్పుడంటే అప్పుడు ఫాస్ట్, సెక్యూర్, ఈజీ క్యాష్ విత్‌డ్రాయల్స్‌ అందించే ఈ మెషిన్లను ఆపరేట్ చేయడం అంత ఈజీ కాదనే విషయం తెలిసిందే. అంతేకాకుండా వీటిలో ఎప్పటికప్పుడు మనీ అనేది లోడ్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ ఏటీఎం సెంటర్లకు ఒక సెక్యూరిటీ గార్డును కూడా నియమించాలి.

ఇక వీటన్నింటి వలన ఏటీఎం ఆపరేట్లపై ఆర్థిక భారం ఎక్కువగా పడుతుంది. ఈ క్రమంలోనే దేశంలోని ఏటీఎంలను నిర్వహించే సంస్థలు ఈ సర్వీస్ లపై ఇంటర్ ఛేంజ్ ఫీజు పెంచాలని తాజాగా డిమాండ్ చేస్తున్నాయి.  అనగా ఒక బ్యాంకు కస్టమర్ వేరే బ్యాంకు ఏటీఎం వాడుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయట. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఎలాంటి ఫీజుల ఉండవు. ముఖ్యంగా ఈ నగరాల్లో ఉండే సేవింగ్స్ బ్యాంక్ కస్టమర్లకు ప్రతి నెలా కనీసం ఐదు ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అందిస్తాయి.  అనగా.. ఐదు సార్లు ఫ్రీగా డబ్బు తీసుకోవచ్చు.  కానీ, ఇందులో మరొక బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీస్తే .. నెలకు మూడు ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉచితం. ఆ తర్వాత మాత్రం  ఇంటర్‌ఛేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక ప్రస్తుతం ఫ్రీ విత్‌డ్రాల తర్వాత.. వేరే బ్యాంకు ఏటీఎం నుంచి ఒకసారి మనీ విత్‌డ్రా చేస్తే రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ ఏటీఎం సంస్థలు ఈ ఛార్జీని రూ.23 వరకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కూడా కోరుతున్నాయి. ఇక ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఏటీఎం సంస్థలు దేశంలోని ఏటీఎంలను ఆపరేట్ చేస్తుంది. అయితే రెండేళ్ల క్రితం ఏటీఎం లావాదేవీల ఛార్జీలు పెరిగాయని ఈ సంస్థ తెలిపింది. దీని వలన ఏటీఎంల నిర్వహణ ఖర్చుతో పాటు ఏటీఎం నెట్ వర్క్ పెంచడానికి, భద్రపరచడానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని.. ఈ కారణంతోనే ఇప్పుడు ఛార్జీలు పెంచాలని ఆర్బీఐకి  కోరింది.

అయితే ఈ ఛార్జీలను రూ.రూ.21కి పెంచాలని CATMI కోరుతోంది. రూ.23 వరకు పెంచాలని కొందరు కోరుతున్నారని ఏటీఎం తయారీదారు AGS ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టాన్లీ జాన్సన్ చెప్పారు. కానీ, దీనిపై ఇంకా ఆర్బీఐ స్పందించలేదని తెలిపింది. ఇక ఛార్జీలు పెంచడానికి అనుమతిస్తే, అది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావచ్చు. ఇక గతంలో అనగా 2021లో ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు గతంలో రూ.15 నుంచి రూ.17కి పెరిగింది. అలానే ఒక్కో లావాదేవీకి చెల్లించే గరిష్ట ఛార్జీ రూ.20 నుంచి రూ.21కి పెరిగింది. దీన్ని మరో రూ.2పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  మరి, ఏటీఎం సేవలపై ఇంటర్‌ఛేంజ్‌ ఫీజును పెంచడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి