Uppula Naresh
Uppula Naresh
గత కొన్ని రోజుల నుంచి వరుస గుండె పోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. 8 ఏళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల వయసు వారి వరకు ఎంతో మంది గుండెపోటుతో ప్రాణాలు వదులుతున్నారు. కాగా, ఈ వరుస హార్ట్ ఎటాక్ మరణాలు మరువకముందే తాజాగా ఓ ఆర్మీ జవాన్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలియడంతో మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. దీంతో అతని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కిష్టపూర్ గ్రామానికి చెందిన సోలంకి సదమ్ అనే యువకుడు ఆర్మీలో గత 14 ఏళ్ల నుంచి జీడీగా పని చేస్తున్నారు. ఆయన ఆర్మీలో పని చేస్తూ మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే సదమ్ ఎప్పటిలాగే ఆదివారం రాత్రి కూడా డ్యూటీకి వెళ్లారు. ఇక డ్యూటీలో ఉండగానే హఠాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో తోటి ఉద్యోగులు అప్రమత్తమై వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ ఆర్మీ జవాన్ సదమ్ తాజాగా ప్రాణాలు విడిచారు. ఇక ఈ విషయం తెలియడంతో మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక ఆర్మీ జవాన్ సదమ్ మృతితో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: కానిస్టేబుల్ రమేశ్.. ఆ ఒక్క పని చేసి ఉంటే బతికేవాడు!