ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. ఆర్థికంగా పేద వాళ్లు అభివృద్ధి చెందేందుకు పలు కీలక పథకాలను ప్రవేశ పెట్టారు. అంతేకాక వింతవులకు, అవ్వ, తాతకలు పెన్షన్ అందిస్తూ..వారికి ఓ భరోసాను సీఎం జగన్ కల్పిస్తున్నారు. భర్త లేని ఆడవారికి, వృద్ధప్యంలో వివిధ అవసరాల కోసం పెద్దవారికి ఏపీ ప్రభుత్వం పెన్షన్ అందిస్తుంది. అలానే ప్రతి నెల ఒకటవ తారీఖ్ జీతం వేసినట్లు వాలంటీర్ల ద్వారా అందజేస్తున్నారు. ఈ పెన్షన్ విషయంలో ఇప్పటి వరకు కేవలం ఇంట్లో ఒకరి మాత్రమే అందేది. ఇదే పెన్షన్ విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేయనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి కుటుంబలో ఒకరి మాత్రమే పెన్షన్ అర్హత ఉండేది. ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అనేది లేదు. అయితే త్వరలో ఇద్దరికీ అందజేసేందుకు జగన్ సర్కారు ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అందించే విషయంలో సాధ్యసాధ్యాలపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. ప్రస్తుతం జగనన్న సురక్ష పేరుతో వాలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబంలో రెండో పెన్షన్ విషయంపై ప్రజలతో అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సర్వే కోసం వాలంటీర్లకు ప్రత్యేకంగా ఒక యాప్ ను ఇవ్వగా.. ఇందులో రెండో వ్యక్తి ఏ పెన్షన్ కు అర్హులు అనే క్వశ్చన్ ను కూడా జత చేశారు. ఈ మేరకు పూర్తి సమాచారాన్ని, వివరాలను వాలంటీర్లు సేకరిస్తున్నారు. అదే సమయంలో వివిధ ప్రశ్నలు అడిగి.. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఒక రేషన్ కార్డుపై ఒక పెన్షన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కూడా దివ్వాంగులకు ప్రభుత్వం మినహాయింపును ఇచ్చింది. కుటుంబంలో ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న వ్యక్తితో పాటు రెండో పెన్షన్ కు అర్హుల వివరాలను వాలంటీర్లు నమోదు చేస్తున్నారు.
వృద్ధులు, ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగులు, చేనేత, కల్లు గీత కార్మికులు, మత్స్యకార,డబ్బు కళాకారులు, హిజ్రాలు వంటి ఎవరైనా కుటుంబంలో రెండో పెన్షన్ కు అర్హులుగా ఉన్నారా? అని వాలంటీర్లు సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం 10 రకాల పింఛన్లపై వివరాలు సేకరిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పక్క ప్రణాళికతో సిద్ధమవుతోంది. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చెపట్టిన రోజు నుంచి ఒకే రేషన్ కార్డు.. ఒకే పెన్షన్ విధానం పక్కగా అమలు చేస్తున్నాడు. అయితే తాజాగా రెండో పెన్షన్ అనేది తెరపైకి వచ్చింది. తాజా సర్వేతో పెన్షన్ విషయంలో సడలింపులు ఉంటాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.